లైంగిక వేధింపులు : తగిన బుద్ధి చెప్పిన నటి

23 Nov, 2018 21:05 IST|Sakshi

మలయాళ, కన్నడ నటి నేహా సక్సేనా తనపట్ల అమర్యాదకరంగా ప్రవర్తించిన వ్యక్తికి భలే బుద్ధి చెప్పారు. లైంగిక వాంఛ తీర్చాలంటూ అతని వక్రబుద్ధిని సోషల్‌ మీడియా సాక్షిగా బహిర్గతంచేయడంతో సదరు వ్యక్తి కక్కలేక మింగలేక, తన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే నెటిజన్లు మాత్రం అతగాడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తమిళ , తెలుగు, బాలీవుడ్‌ సినిమాల్లో కూడా నటించిన నేహా సక్సేనా స్వయంగా ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌ పోస్ట్‌ద్వారా వెల్లడించారు. అబుదాబిలో షైన్‌ సిస్టం సర్వీసెస్‌లో పనిచేసే ఎల్సన్‌ లోహి దక్షన్‌ అనే వ్యక్తి  ఒక రాత్రికి తన కోరిక తీర్చాల్సిందిగా వాట్సాప్‌ద్వారా ప్రతిపాదన పెట్టాడు.  దీంతో ఎంత అవుతుందో  తెలపాలని కోరాడు. దీంతో ఆమె లోహిదక్షన్‌ ఫోన్‌ సంబరుతో సహా అతని వాట్సాప్‌ సంభాషణకు సంబంధించిన స్ర్కీన్లను ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో షేర్‌ చేశారు. 

మరోవైపు ఈఆరోపణలను లోహిదక్షన్‌ ఖండించాడు. తన ఫోన్‌ హ్యాక్‌ అయిందనీ, మహిళల పట్ల తాను ఎపుడూ అలా పవర్తించలేదని ఫేస్‌బుక్‌లోవివరణ ఇచ్చుకున్నాడు. దీనిపై అబుదాబి సీఐడీకి ఫిర్యాదు చెసినట్టువెల్లడించాడు. అంతేకాదుతన కరియర్‌ నాశనమవుతుంది, కుటుంబానికి తెలిస్తే తన పరువు పోతుందంటూ లబోదిబోమంటున్నాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా