ఆయన అచ్చంగా మా నాన్నలానే!

26 Jul, 2017 01:13 IST|Sakshi
ఆయన అచ్చంగా మా నాన్నలానే!

నా వయసెంత? ఆయన వయసెంత? అయినా సరే సెట్స్‌లో నన్ను ‘జీ’ (గారు) అని గౌరవంగా పిలిచేవారు. మా నాన్న కూడా అంతే. ఎదుటి వ్యక్తి వయసు, అనుభవంతో సంబంధం లేకుండా గౌరవిస్తారు. ఆయనలో ఈ మర్యాద నాకు బాగా నచ్చేసిందంటున్నారు కమల్‌హాసన్‌ రెండో కుమార్తె అక్షరాహాసన్‌.

ఎవరి గురించి చెబుతున్నారీ అమ్మాయి? అంటే... తమిళ హీరో అజిత్‌ గురించి! సెట్స్‌లో అజిత్‌ ఇతరుల్ని గౌరవించే తీరు సేమ్‌ టు సేమ్‌ మా నాన్నలానే ఉంటోందన్నారు. ‘వీరం, వేదాలం’ సినిమాల తర్వాత శివ దర్శకత్వంలో అజిత్‌ హీరోగా నటిస్తున్న సినిమా ‘వివేకం’. ఇందులో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌. ఆ సంగతి తెలిసే అక్షరాహాసన్‌ కీలక పాత్ర నటించడానికి అంగీకరించారట. ‘‘హీరోయిన్‌గా నటించడం నాకిష్టమే. కానీ, నేను చేసిన రోల్‌ బాగుంది.

ఐయామ్‌ హ్యాపీ’’ అన్నారు అక్షర. ఈ అమ్మాయి హిందీ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమై, ఇప్పుడు మాతృభాష తమిళంలో సినిమా చేశారు. తమిళ సినిమాలు కంటిన్యూ చేస్తారా? అని అక్షరను అడిగితే... ‘‘నాకు భాషాబేధాలు లేవు. కొన్నాళ్లుగా నాన్నతో మాట్లాతున్నప్పుడు తమిళంలోనే మాట్లాడుతున్నా. స్పష్టంగా తమిళంలో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నా. నేనెందుకు అలా చేస్తున్నానో నాన్నకు అర్థమైంది’’ అని నవ్వేశారు. సో, అక్షర మరిన్ని తమిళ సినిమాల్లో నటించాలని ఆశపడుతున్నారన్న మాట!!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి