బిగ్‌ ఫ్యాన్‌ బేస్‌

2 Oct, 2018 00:04 IST|Sakshi

లైట్స్‌ ఆఫ్‌ అయ్యాయి... బిగ్‌బాస్‌ తలుపులు మూసుకున్నాయి.
షో ముగించుకుని కోట్లాది అభిమానుల హృదయాలలో 
తలుపులు తెరుచుకుంటూ నాని బయటకు వచ్చారు.
చేయగలనో లేదో.... సక్సెస్‌ అవుతుందో లేదో... 
సీజన్‌ 1తో  పోల్చి చూస్తారో ఏమో... వీటన్నింటి మధ్యా షో పెద్ద హిట్‌ అయ్యింది.
ఇంటింటి టీవీని ‘నా...నీ’... టీవీగా మార్చుకున్న నానితో స్పెషల్‌ ఇంటర్వ్యూ.

∙‘బిగ్‌బాస్‌’ ముగిసింది. ఇక ‘నా.. నీ... టీవీలో’ అంటూ  చిన్నితెరపై కనిపించరు... బిజీ తగ్గి రిలాక్స్‌ అవుతున్నారా?నాని: అవును. నా లోపల నుంచి ఏదో పెద్ద బరువు బయటకు వెళ్లిపోయినట్టు అనిపించింది. చాలా లైట్‌గా ఫీల్‌ అవుతున్నాను. ‘బిగ్‌ బాస్‌’ అయిపోయింది అని కాదు. గత నాలుగు నెలల్లో ఒక్క పూట కూడా సెలవు తీసుకోలేదు. చిన్నప్పుడు ఫైనల్‌ ఎగ్జామ్స్‌లో చివరి పరీక్ష అయిపోతే ‘ఏయ్‌ .. సమ్మర్‌ హాలీడేస్‌’ అని గంతులేస్తాం కదా. నా పరిస్థితి అలా ఉంది. శనివారం, ఆదివారం రెండు రోజులే కనిపించినా హౌస్‌మేట్స్‌ను ఫాలో అవుతూ షోకు ప్రిపేర్‌ అవుతూ అదంతా పెద్ద పని. ఎట్టకేలకు ముగిసింది. అందుకే ఆనందం.

బుల్లితెరకు కొన్ని రోజులు దూరంగా ఉండాలనుకుంటున్నారా? 
దూరంగా ఉండటమేమీ లేదు. ఒకవేళ ఏదైనా షో కమిట్‌ అయితే ఆ టైమ్‌లో వేరే సినిమా లేకుండా చూసుకుంటాను. ఎందుకంటే ఫ్యామిలీ టైమ్‌ అస్సలు ఉండటం లేదు. మా బుడ్డోడు ఎదుగుతున్నాడు. ఈ టైమ్‌లో ఫ్యామిలీని మిస్‌ అవ్వకూడదు. ఇలాంటి టైమ్‌ తిరిగి రాదు కదా. 

బిగ్‌ బాస్‌ ప్లెజర్‌గా అనిపించిందా... ప్రెషర్‌గా అనిపించిందా? 
ప్రెషరే. ఆ గేమ్‌ ఫార్మాటే అలాంటిది. అందర్నీ ఆనందపరచలేం. ఒక్కొక్కరికి ఒక్కో ఫేవరేట్‌ ఉంటారు. మనమేమో పక్షపాతం చూపించకూడదు. హోస్ట్‌కి నచ్చినవాళ్లంటూ స్పెషల్‌గా ఉండకూడదు. అందరూ సమానమే. అది కొంచెం ప్రెషర్‌గా ఉంటుంది. ఈ మధ్య ‘దేవదాస్‌’ ప్రమోషన్‌ కోసం ఎక్కడికి వెళ్లినా ‘బిగ్‌ బాస్‌’ గురించి అడిగేవాళ్లు. కొత్త ఫ్యాన్‌ బేస్‌ వచ్చిందని అర్థమైంది.

ప్రతి వారం ఒక్కొక్కరిని ఎలిమినేట్‌ చేయాలి. ‘మీరు ఎలిమినేట్‌ అయ్యారు..’ అని చెప్పేటప్పుడు బాధగా ఉండేదా?
కొంచెం బాధ ఉంటుంది. ఎలిమినేట్‌ అయ్యేవాళ్ల ‘బిగ్‌ బాస్‌ జర్నీ వీడియో’ బ్యూటిఫుల్‌గా ఉండాలి. వాళ్లు ఇంటికి వెళ్తున్నారు కాబట్టి పాజిటివ్‌గా ఉండాలి. నెగటివ్‌గా ఉండకూడదని చెబుతుండేవాణ్ని. ఎలిమినేట్‌ అయ్యారు అనే మాట చెప్పే ముందు సంఘర్షణ అనిపించేది.

హోస్ట్‌గా కాకుండా మిమ్మల్ని ఆ హౌస్‌లో ఉండమంటే ఉండగలుగుతారా? అన్ని రోజులు.
లేదు. ఇంపాజిబుల్‌. ఆడియన్స్‌కు బిగ్‌ బాస్‌ హౌస్‌ చూపించడానికి షూటింగ్‌ కోసం మూడు గంటలు ఉన్నాను. ఆ రెండు మూడు గంటలే చాలా ఎక్కువ అనిపించింది. 

రెండు సీజన్స్‌లో అబ్బాయిలనే గెలిపించారు. అమ్మాయిల్ని తక్కువ చేశారా?
(నవ్వేస్తూ) గెలిపించింది మేం కాదు. ప్రేక్షకులే. వాళ్లని అడగాలి ఈ ప్రశ్న. ఇదంతా ఓటింగ్‌ విధానం. 

ఓటింగ్‌ పారదర్శకంగానే జరుగుతుందా అనే అనుమానాలు బయటి వాళ్లకు ఉంటాయి? 
అంతా పారదర్శకంగా జరిగింది. హిందీ, తమిళం, తెలుగు ‘బిగ్‌ బాస్‌’.. అన్ని భాషల ఓటింగ్స్‌ ఒకే ఏజెన్సీ చూసుకుంటుంది. షూటింగ్‌ జరిగే 3–4 గంటల ముందు రిజల్ట్‌ మాకు చెబుతారు. వెంటనే ఎలిమినేట్‌ అయ్యేవాళ్ల వీడియోలు రెడీ చేయాలి.  ఎవరెళ్తున్నారో తెలియదు కాబట్టి అందరి వీడియోలు రఫ్‌గా కట్‌ చేసి పెట్టుకుంటాం. మాకు రిజల్ట్‌ తెలిశాక వీడియో ఫైనల్‌ చేసి అప్‌లోడ్‌ చేయాలి. కొన్ని షోస్‌కి ప్రైజ్‌మనీ అది ఇదీ అంటారు. ఇది మాత్రం అలాంటి షో కాదు. పూర్తి పబ్లిక్‌ ఓటింగ్‌ మీద ఆధారపడి ఉంటుంది. 

సీజన్‌ 3 చేయమంటే చేస్తారా? 
ఇదే నా లాస్ట్‌ సీజన్‌. నిన్ననే ట్విట్టర్‌లో అనౌన్స్‌ చేశాను కూడా.

మొదట్లో ఎన్టీఆర్‌తో పోల్చారు అప్పుడు ఎలా అనిపించింది?
పోలికలు ఉంటాయి అని ముందే తెలుసు. సీజన్‌ 2కి వచ్చే సరికి టాస్క్‌లు కొన్ని అగ్రెసీవ్‌గా ఉన్నాయి. ఈ సీజన్‌ బ్లాక్‌బస్టర్‌. మొదట్లో కొంచెం నెగటివిటీ వచ్చింది. ఆకాశానికి ఎత్తేసిన ఆర్టికల్స్‌ చూశాను. కిందకి దించేసినవీ చూశాను.  అప్స్‌ అండ్‌ డౌన్స్‌ రెండూ ఉంటాయి. నాకు యాక్టింగ్‌ అంటే ఇష్టం. సక్సెస్‌ అనేది బోనస్‌. ఈ హోస్టింగ్‌ కూడా చాలెంజ్‌గా తీసుకున్నాను. నా బెస్ట్‌ ఇచ్చాను. 

‘దేవదాస్‌’ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పింది
‘దేవదాస్‌’ ఎక్స్‌పీరియన్స్‌ ఎలా ఉంది?
నేను పర్సనల్‌గా ఈ ఎక్స్‌పీరియన్స్‌ చాలా ఎంజాయ్‌ చేశాను. ఇంతకు ముందు మల్టీస్టారర్స్‌ చేస్తారా అని అడుగుతుంటే స్క్రిప్ట్‌ వస్తే చేస్తాను అని చెప్పేవాణ్ణి. ప్రతిసారి ఇలా చెప్పడమే తప్పితే చేసే చాన్స్‌ వస్తుందా? అనుకున్నాను. నిజంగా మంచి స్క్రిప్ట్‌ వచ్చింది. డాన్, డాక్టర్‌ కాంబినేషన్‌ సెట్‌ అయితేనే ఈ కథ సెట్‌ అవుతుంది. అలా కాకపోతే ఆ సినిమా చేసి ఉపయోగం లేదనిపించింది. లక్కీగా నాగ్‌ సార్‌కి కూడా స్క్రిప్ట్‌ నచ్చింది. చేసేటప్పుడే చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం.  రెగ్యులర్‌ కమర్షియల్‌ ఫార్మాట్‌లో లేకుండా చేశాం. ఇప్పుడు రెస్పాన్స్‌ చూస్తుంటే సంతోషంగా ఉంది. ఫ్యూచర్‌లో కూడా మంచి స్క్రిప్ట్‌ వస్తే మల్టీస్టారర్‌ సినిమా తప్పకుండా చేస్తాను. 

సినిమాలో మీ కళ్లద్దాలు, బాడీ లాంగ్వేజ్‌ బావుంది. పాత్ర కోసం డాక్టర్స్‌ని పరిశీలించడం లాంటివి ఏవైనా చేశారా? 
మా కజిన్స్‌లో, ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లో డాక్టర్స్‌ చాలామందే ఉన్నారు. అమ్మ చాలా కాలం డాక్టర్స్‌తో వర్క్‌ చేశారు. సో కొంచెం ఐడియా ఉంది. అది నా యాక్టింగ్‌లోకి ట్రాన్స్‌ఫామ్‌ అయింది అని అనుకోను. యాక్టింగ్‌ అనేది  డిఫరెంట్‌ గేమ్‌. యాక్టింగ్‌ అంతా మన అబ్జర్వేషన్‌ బట్టి ఉంటుంది. అలానే మా సినిమాలో డాక్టర్‌ హీరోలా కనబడకూడదు. డాక్టర్‌ డాక్టర్‌లా కనబడాలి. లుక్‌ ట్రైల్స్‌ చాలా చేశాం. అందరికీ ఈ లుక్‌ నచ్చింది. 

నాని ఏ క్యారెక్టర్‌ అయినా బాగా చేస్తాడు అని  మీ మీద ఆడియన్స్‌లో ఓ అభిప్రాయం ఏర్పడింది.  అలాంటివి మీకు భయం కలిగిస్తాయా? 
భయం కంటే కూడా బాధ్యత అనిపిస్తుంది. ఓహో మన మీద ఇంత నమ్మకం పెట్టుకున్నారు జాగ్రత్తగా చేయాలి అనే ఫీలింగ్‌ వస్తుంది. ఏ అంచనాలు లేకపోతే ఫర్లేదు.. బానే ఉందిలే అనుకుంటాం. కానీ ఇలాంటి అంచనాలు ఉన్నపుడు మనల్ని మనమే ఇంకా పుష్‌ చేసుకుంటాం మంచి అవుట్‌పుట్‌ కోసం. ఒక రకంగా అది యాక్టర్‌కి మంచిది. మనకి అభినందనలు వచ్చాయి అని ఎగరకుండా మనల్ని ఇంకా ఇంకా మెరుగుపరుచుకోవాలి అని అనుకుంటుంటాను. యాక్టర్‌గా ఎదుగుతున్నాను అని అంటున్నారంటే అది ప్రేక్షకులు చూపిస్తున్న నమ్మకమే. 

నాని ‘ఈ ఇమేజ్‌ ఉన్న హీరో’ అని ఓ బ్రాండ్‌ లేకపోవడంతో మీరు ఏ స్క్రిప్ట్‌ అయినా ఎంచుకోవచ్చు. మీకున్న అడ్వాంటేజ్‌ అది అని భావిస్తారా? 
అవును. దాని వల్లే పూర్తి కమర్షియల్‌ సినిమాల్లో కనిపించగలుగుతున్నాను. అసలు కమర్షియల్‌ ఎలిమెంట్‌ అనేది లేని సినిమాల్లో కూడా యాక్ట్‌ చేస్తున్నాను. ఇంకా చాలా కథలు చెప్పాలి అనుకోవడం, వరుసగా అన్ని సినిమాల్లో యాక్ట్‌ చేయడం వల్ల స్క్రిప్ట్స్‌ వినడానికి కూడా సమయం దొరకడం లేదు. ఈ ప్రాసెస్‌లో కొన్ని మిస్‌ అవుతూనే ఉన్నాను.

నెక్స్‌ సినిమాలు 
‘జెర్సీ’ ఒక్కటే ఫిక్స్‌ అయ్యాను. 4 సినిమాల  వరకూ డిస్కషన్స్‌ జరుగుతున్నాయి. ఏది ఫస్ట్‌ పట్టాలెక్కుతుందో మాత్రం చెప్పలేను. 


హాలిడే ట్రిప్‌ ప్లాన్‌  చేసినట్లున్నారు?
అవును. ప్లేస్‌ ఇంకా డిసైడ్‌ చేసుకోలేదు. ఈ నెల 18 వరకూ హాలీడే. 18కి తిరిగి వచ్చేస్తాను. ఆ తర్వాత ‘జెర్సీ’ షూటింVŠ  స్టార్ట్‌ చేస్తాను. 

మరిన్ని వార్తలు