అమ్మానాన్నలకు ప్రామిస్‌ చేశా!

31 Oct, 2017 23:59 IST|Sakshi

‘నేను ఫస్ట్‌ టైమ్‌ నా సినిమా చూస్తే... అందులో నేను చేసిన తప్పులే కనిపిస్తాయి. మూడు, నాలుగుసార్లు చూస్తే సినిమా అర్థమవుతుంది. కానీ, ఈ సిన్మా ఫస్ట్‌ కాపీ చూశా. బాగుంది. ‘డై హార్డ్, బార్న్‌ ఐడెంటిటీ, లీథల్‌ వెపన్‌’ వంటి ఇంగ్లీష్‌ సిన్మాల తరహాలో ఉంటుంది’’ అన్నారు రాజశేఖర్‌. ఆయన హీరోగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఎం. కోటేశ్వర్‌రాజు నిర్మించిన ‘పీఎస్వీ గరుడవేగ 126.18ఎం’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రాజశేఖర్‌ చెప్పిన సంగతులు...

దేశం కోసం ఓ ఎన్‌ఐఏ ఆఫీసర్‌ ఏం చేశాడనేది చిత్రకథ. నన్ను దృష్టిలో పెట్టుకునే కథ రాశానని ప్రవీణ్‌ చెప్పినప్పుడు పెద్ద అవార్డు వచ్చినట్టు ఫీలయ్యా. బౌండ్‌ స్క్రిప్ట్‌తో, పర్‌ఫెక్ట్‌ప్లానింగ్‌తో 90 రోజుల్లో సినిమా తీశాడు. యాక్షన్‌ ఫిల్మ్‌ అయినా... వృత్తిపర, వ్యక్తిగత జీవితాల మధ్య ఎన్‌ఐఏ ఆఫీసర్‌ పడే సంఘర్షణను మంచి వినోదాత్మకంగా చూపించారు దర్శకుడు.నా గత సినిమాలకు భిన్నంగా తక్కువ మాటలు, ఎక్కువ యాక్షన్‌తో... కమర్షియల్‌ హంగులతో సినిమా ఉంటుంది. నేనయితే కథ మొత్తం చెప్పేసేవాణ్ణి (నవ్వుతూ). మా దర్శకుడుఇంతకు మించి చెప్పొద్దన్నారు. థియేటర్‌లో చూస్తే మీకు మంచి ఫీల్‌ కలుగుతుంది.ఎన్‌ఐఏ ఆఫీసర్‌ కదా! మంచి ఫిట్‌నెస్‌తో కనిపించాలని ముందు వర్కౌట్స్‌ గట్రా చేశా. షూటింగుకి సరిగ్గా నెల రోజుల ముందు ప్రతిరోజూ ఛాతీలో నొప్పి వచ్చేది. హాస్పిటల్‌కి వెళితే.. ‘హార్ట్‌ఎటాక్‌’ అన్నారు. స్టెంట్‌ వేశారు. మినిమమ్‌ సిక్స్‌ మంత్స్‌ రెస్ట్‌ తీసుకోమన్నారు. దాంతో అనుకున్న టైమ్‌ కంటే పది రోజులు లేటుగా షూటింగ్‌ స్టార్ట్‌ చేశా. ఇంకా రెస్ట్‌ తీసుకుంటే మిగతాఆర్టిస్టుల డేట్స్‌ డిస్ట్రబ్‌ అవుతాయి. అది నాకిష్టం లేదు. దేవుడి దయవల్ల షూటింగ్‌ హ్యాపీగా జరిగింది.

‘రాజశేఖర్‌... నీకు పర్‌ఫెక్ట్‌ కమ్‌బ్యాక్‌ ఫిల్మ్‌ ఇది’ అని షూటింగులో నాజర్‌గారు అన్నారు. టీజర్, ట్రైలర్స్‌ చూసిన చాలామంది అభిప్రాయమిదే. కానీ, ఈ సినిమా ప్రారంభానికి ముందు నామార్కెట్‌ బాగోలేదు. సొంతంగా సినిమాలు నిర్మించి బోలెడు డబ్బులు పోగొట్టుకున్నా. అప్పుడు మా అమ్మ బాధపడ్డారు. నేను ఏమవుతానోనని ఆందోళన పడితే... ఇకపై సినిమాలునిర్మించనని అమ్మానాన్నలకు ప్రామిస్‌ చేశా. ప్రవీణ్‌ ఆరేడు కోట్లు బడ్జెట్‌ అవుతుందన్నారు. అప్పుడు నాన్నగారి స్నేహితుడు కోటేశ్వర్‌రాజుగారు గుర్తొచ్చారు. ఆయన నాతో సినిమాచేయాలనుకుంటున్నారని ఎప్పట్నుంచో నాన్న చెబుతుంటే... నా డిప్రెషన్‌ పోగొట్టడానికి చెబుతున్నారనుకున్నా. కానీ, కథ విని 25 కోట్లు ఖర్చు చేశారు.చిరంజీవిగారిని ప్రీమియర్‌ షోకి ఆహ్వానించడానికి వెళితే.. ‘మా ఆఫీసులో మీ ట్రైలర్‌ గురించి చాలాసేపు మాట్లాడుకున్నాం. పెద్ద హిట్టవుతుంది’ అన్నారు. ప్రచార చిత్రాలు చూసిన ప్రతి ఒక్కరూ అదే మాట చెబుతున్నారు. ‘గరుడవేగ’ హిట్టయితే... సక్సెస్‌ క్రెడిట్‌ అంతా నాన్న, ప్రవీణ్, కోటేశ్వర్‌రాజు, జీవితలకు చెందుతుంది. షూటింగులో ఎన్ని ఫైనాన్షియల్‌ ప్రాబ్లమ్స్‌ ఎదురైనా.. జీవిత చక్కగా హ్యాండిల్‌ చేసింది. ఓ రకంగా జీవిత నాకిస్తున్న బహుమతి ఇది. రామ్‌చరణ్‌ ‘ధృవ’లో అరవింద్‌స్వామి చేసినటువంటి విలన్‌ రోల్స్‌ వస్తే నటిస్తా. అంతే కానీ... జస్ట్‌.. విలన్‌ ఫర్‌ విలన్‌ రోల్స్‌ వస్తే చేయను.

మరిన్ని వార్తలు