ప్రేమ  కుట్టింది

14 Feb, 2019 00:57 IST|Sakshi

టాలీ, కోలీ, బాలీ.. అన్ని వుడ్‌లనూ దాటిలవేరియా అన్ని అడవు(డ్‌)లకూ పాకింది.గుయ్‌.. గుయ్‌ మంటూ..ఈ వుడ్డునుంటావా, ఆ వుడ్డునుంటావాఅని అడిగేవరకూ ఆగడం లేదు. పడవెక్కి ప్రేమవుడ్డుకు.. సారీ.. ప్రేమఒడ్డుకుసాగిపోతోంది. అన్ని వుడ్‌ల ప్రేమా ఫలించాలి. 

స్క్రీన్‌ మీద లవ్‌బర్డ్స్‌కి లైఫ్‌లో కూడా లవ్‌ వైరస్‌  సోకితే.. అభిమానులు, ఆడియన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ వాక్సిన్‌ వేసుకుంటారు. అలా లవేరియాతో అయిదు జంటలు ఎంజాయ్‌ చేస్తున్నాయి. ఎవరో తెలుసుకోండి... పండగ చేసుకోండి ‘వాలెంటైన్స్‌డే’ను.  

ఆ దేవుడే పంపాడు
ఈ సంక్రాంతికి విశాల్‌ తన పెళ్లిని కన్ఫార్మ్‌ చేశారు. అనీషా ఆళ్ల అనే హైదరాబాద్‌ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పారాయన. అనీషా కూడా నటే. ‘పెళ్ళి చూపులు, అర్జున్‌ రెడ్డి’ చిత్రాల్లో ఆమె నటించారు. ‘‘అనీషాతో నా పరిచయం పెళ్లివరకు వెళ్తుందని ఊహించలేదు. తనలో ఎన్నో మంచి క్వాలిటీస్‌  ఉన్నాయి. తను బాస్కెట్‌బాల్‌ నేషనల్‌ ప్లేయర్‌. సోషల్‌ వర్కర్‌ కూడా. మా పెళ్లి అయ్యాక అనీషా సినిమాలు మానేస్తుందని నేను చెప్పలేను. ఆమెను దేవుడే నా కోసం పంపాడు’’ అని విశాల్‌ అంటారు. విశాల్, అనీషా నిశ్చితార్థం మార్చిలో జరగనుందట. పెళ్లి ఆగస్టులో జరగనుందని టాక్‌.

పెళ్లి కబురు ఎప్పుడొస్తుందో!
కోలీవుడ్‌లో ప్రేమపక్షులు అంటే నయనతార, విఘ్నేష్‌ శివన్‌లే.  లేటెస్ట్‌గా ఆర్య, సాయేషాల పేర్లూ టైటిల్‌ కార్డ్స్‌లో చేరాయి. ఈ ఇద్దరూ కలిసి  ‘గజనీకాంత్‌’ అనే సినిమాలో జంటగా నటించారు. ఈ సినిమా టైమ్‌లోనే ఈ ఇద్దరి మీద కాదల్‌ (ప్రేమ) క్లాప్‌ కొట్టిందట. ఇప్పుడు సూర్య హీరోగా నటిస్తున్న ‘కాప్పాన్‌’ సినిమాలో సాయేషా కథానాయికగా నటిస్తుండగా, ఆర్య ఓ కీలక పాత్ర చేస్తున్నారు. అతి త్వరలో ఆర్య, సాయేషాల వివాçహానికి సంబంధించి అధికారిక ప్రకటన రావొచ్చనే వార్త వైరల్‌ అయింది  తమిళ సినీ పరిశ్రమలో. 

ఫొటోలతో కన్ఫార్మ్‌ 
బాలీవుడ్‌ కూడా లవ్‌ ఫ్లూతో ఫ్లేమ్‌ అవుతోంది. నటుడు, దర్శకుడు  ఫర్హాన్‌ అఖ్తర్, నటి షిబానీ దండేకర్‌ ప్రేమలో ఉన్నారని ఎప్పటినుంచో వినపడుతోంది. సోషల్‌ మీడియాలో  కనపడుతోంది కూడా. గతేడాది అక్టోబర్‌లో ఫర్హాన్‌ అఖ్తర్, షిబానీ ఇద్దరూ ఒకేఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఫర్హాన్‌ లవ్‌ సింబల్‌ను జతపెట్టి మరీ పోస్ట్‌ చేశారు. దీంతో వీరిద్దరి లవ్‌కి కన్ఫర్మేషన్‌ వచ్చినట్టయింది.  ‘‘మీరు ఫర్హాన్‌తో ప్రేమలో ఉన్నారా?’’ అని షిబానీని అడిగితే ‘‘మేం పోస్ట్‌ చేసే ఫొటోలను బట్టే అందరూ అర్థం చేసుకోవాలి’’ అని జవాబు ఇచ్చారు. దాంతో ఈ ఏడాదే వీళ్లిద్దరూ మ్యారేజ్‌ చేసుకోనున్నారని బాలీవుడ్‌లో ఒకటే హోరు. 

రోహ్మాన్‌తో ప్యార్‌ మే
1994 మిస్‌ యూనివర్స్‌ సుష్మితా సేన్‌ ఇప్పుడు సినిమాల్లో రేర్‌ అయినా పబ్లిసిటీలో జోరుగా ఉన్నారు... రోహ్మన్‌ షాల్‌ అనే వ్యక్తితో లవ్‌లో పడి. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ పెళ్లిలో ఈ జంట  వేసిన స్టెప్స్‌ సూపర్‌ హిట్‌. ‘రోహ్మాన్‌తో ప్యార్‌ మే’  కదా అంటే సుష్మితా నవ్వుతున్నారు.  ‘మీ పెళ్లెప్పుడు?’  అంటే మాత్రం ‘నా పెళ్లి విషయం మీకెందుకు’ అంటూ  మండిపడతున్నారట. కానీ మీడియాలో అయితే వీళ్లిద్దరూ ఈ ఏడాది వివాహం చేసుకోబోతున్నారనే న్యూస్‌ స్ట్రీమ్‌ అవుతోంది. సుష్మితా సేన్‌కు రినీ సేన్, అలీసా సేన్‌ అనే ఇద్దరు దత్తపుత్రికలు ఉన్న సంగతి తెలిసిందే.

లవ్‌ ఫర్‌ హార్లిన్‌ 
‘ఉరి: ది సర్జికల్‌స్ట్రైక్‌’తో 200 కోట్ల క్లబ్‌లో చేరాడు విక్కీ కౌశల్‌. పర్సనల్‌ లైఫ్‌ను లవ్‌ క్లబ్‌లో రిజిష్టర్‌ చేయించుకున్నాడు. హార్లిన్‌ సేథి అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నట్లు చెప్పారు విక్కీ. ‘‘కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా ఓ పార్టీలో హార్లిన్‌ను కలిశాను. లాస్ట్‌ ఇయర్‌ నుంచే తనతో డేటింగ్‌లో ఉన్నా. ఒకరినొకరం తెలుసుకుంటున్నాం. మా రిలేషన్‌ బాగుంది’’ అని చెప్పారు విక్కీ కౌశల్‌.

మొహబ్బతే...
తాప్సీ–మాథ్యాస్‌ బో,  శ్రుతీహాసన్‌ – మైఖేల్‌ కోర్సలే, ఇలి యానా –ఆండ్రూ నీబోన్, నటాషా దలాల్‌–వరుణ్‌ధావన్, ఆలియా భట్‌–రణ్‌బీర్‌ కపూర్, రియా కపూర్‌–కరణ్‌ బులానీ, టైగర్‌ ష్రాఫ్‌–దిశా పాట్నీ... ఈ జంటలు ప్రేమలో మునిగి ఉన్నట్లు  వాళ్ల తీరు స్పష్టం చేస్తోంది. వీళ్ల ప్యార్‌ ఈ యేడాదైనా మ్యారేజ్‌ టేక్‌ తీసుకుంటుందా? చూడాలి!  ఇంతకీ ఇక్కడ ప్రస్తావించిన జంటల్లో రియా కపూర్‌ ఎవరో అనుకునేరు... ప్రముఖ నటుడు అనిల్‌ కపూర్‌ కుమార్తె, నటి సోనమ్‌కపూర్‌ సోదరే  రియా.

రింగులు మార్చుకున్నారు
నిశ్చితార్థంతో  సగం పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన కథానాయికలూ ఉన్నారు.  జో అనే వ్యక్తితో రిచా గంగోపాధ్యాయ, జార్జ్‌ పానాయియోటోన్‌తో అమీ జాక్సన్, గుణ జక్కాతో అనీషా అంబ్రోస్‌లకు ఎంగేజ్‌మెంట్‌ అయింది. వీళ్ల పెళ్లి తేదీలు ఇంకా ఖరారు కాలేదు.

జతకూడేనా?
టాలీవుడ్‌లో ప్రేమ, పెళ్లి  టాపిక్స్‌ వస్తే చాలు వెంటనే ప్రభాస్, రానా గుర్తొస్తారు. వీరితోపాటు వరుణ్‌ తేజ్, శర్వానంద్, నితిన్, నిఖిల్, విజయ్‌ దేవరకొండ, సాయిధరమ్‌ తేజ్, అఖిల్, నాగశౌర్య, రాజ్‌ తరుణ్‌ వంటి హీరోల స్టేటస్‌ సింగిల్‌గానే ఉంది. వచ్చే ప్రేమికుల రోజుకైనా వీరికి వాళ్ల వేలెంటైన్‌ దొరికేనా.. జత కూడేనా? కాలం కాదల్‌తో జవాబిస్తుందేమో చూద్దాం!


ప్రేమించు.. పెళ్లాడు
ఇటీవల ప్రేమ వివాహలు చేసుకున్న జంటలు చాలానే ఉన్నాయి. మలయాళ నటి భావన.. నిర్మాత నవీన్‌ను, శ్రియ తన ప్రేమికుడు అండ్రూ కృశ్చేవ్‌ను,  కలర్స్‌ స్వాతి పైలట్‌ వికాస్‌ను పెళ్లి చేసుకున్నారు. అంతేకాదు నటి శ్వేతాబసు ప్రసాద్‌ గత డిసెంబర్‌ 13న పుణేలో రోహిత్‌ మిట్టల్‌కు జీవితభాగస్వామి అయ్యారు.  సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కుమార్తె , దర్శక, నిర్మాత సౌందర్యా రజనీకాంత్‌ వ్యాపారవేత్త  విశాగన్‌ వనంగాముడిని వివాహమాడారు. ఇక బీటౌన్‌ పెళ్లిళ్ల వైపు వెళితే.. దీప్‌వీర్‌ల (దీపికా పదుకోన్‌–రణ్‌వీర్‌ సింగ్‌)  ఇటలీలో జరిగిన డెస్టినేషన్‌ వెడ్డింగ్‌తో ఒకింటి వారయ్యారన్నది సినీ అభిమాన జగమెరిగిన సత్యం.  ప్రియాంకా చోప్రా–నిక్‌ జోనస్‌ (నిక్యాంక)లు కూడా గత డిసెంబర్‌ 1, 2 తేదీల్లో రాజస్థాన్‌లోని జో«ద్‌పూర్‌లో పెళ్లి చేసుకున్నారు. డిసెంబర్‌ 1న క్రిస్టియన్‌ స్టైల్‌లో, డిసెంబర్‌ 2న నార్త్‌ ఇండియన్‌

స్టైల్‌లో ఆ పెళ్లి వేడుకలు జరిగాయి. బాలీవుడ్‌ నటి సోనమ్‌ కపూర్, ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఆనంద్‌ ఆహూజాల వెడ్డింగ్‌ పంజాబ్‌ స్టైల్‌లో గత మే 8న జరగింది. సోనమ్‌ కపూర్‌ పెళ్లి జరిగిన రెండు రోజుల తర్వాత మే 10న నేహా« «ధూపియా, అంగద్‌ బేడీల పెళ్లి అయింది.  నటుడు మిలింద్‌ సోమన్, అంకిత కోన్వార్‌..  ఏప్రిల్‌ 22న మహారాష్ట్రియన్‌ వివాహ పద్ధతిలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు.  దర్శక–నిర్మాత దినేష్‌ విజన్‌ దుబాయ్‌కి చెందిన ప్రమీత తన్వర్‌ను,  బాలీవుడ్‌ నటుడు, కమెడియన్‌ కపిల్‌ శర్మ.. గిన్ని చత్రాథ్‌ను పరిణయమాడారు. వీరితో పాటు హిందీ బుల్లితెర నటీనటులు కొందరు గతేడాది మ్యారీడ్‌ లైఫ్‌కు శ్రీకారం చూట్టారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా