పిల్లలకు ప్రత్యేకం..

14 Nov, 2014 00:00 IST|Sakshi
పిల్లలకు ప్రత్యేకం..

పిల్లల పెంపకంపై ఆధునిక జీవన శైలి ఎలాంటి ప్రభావం చూపుతోంది? తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే కథాంశంతో రూపొందిన బాలల చిత్రం ‘ఆత్రేయ’. టైటిల్ రోల్‌ను ఆదిత్య చేశాడు. పలు సాఫ్ట్‌వేర్ సంస్థలు అందించిన ఆర్థిక సాయంతో స్టార్ట్ హెల్ప్ ఫౌండేషన్, డాట్‌కామ్ ఆర్ట్ క్రియేషన్స్ కలిసి నిర్మించిన ఈ చిత్రానికి శాంతికుమార్ చిలుముల దర్శకుడు.

చిల్డ్రన్స్ డే సందర్భంగా  నేడు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ-‘‘వినోదం, సందేశం ఉన్న చిత్రమిది. పన్ను మినహాయింపు కోసం రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తులు అందించాం. ఇప్పటికే ప్రివ్యూ చూసి పలువురు అభినందించారు. ఈ చిత్రం ద్వారా వచ్చే లాభాలను అనాథ బాలలకు వినియోగిస్తాం’’ అన్నారు.