‘శ్రీదేవి ఇక లేరా?’

25 Feb, 2018 12:58 IST|Sakshi

ఆమె మరణ వార్తతో షాక్‌ గురయ్యామన్న క్రీడా ప్రముఖులు

సాక్షి, స్పోర్ట్స్‌ : సీనియర్‌ నటి శ్రీదేవి(54) హఠాన్మరణం షాక్‌కు గురిచేసిందని పలువురు క్రీడా ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. టీమిండియా మాజీ, ప్రస్తుత క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, మహ్మద్‌ షమీ, ఆకాశ్‌ చోప్రా, అశ్విన్‌, ప్రజ్ఞాన్‌ ఓజా, రెజ్లింగ్‌ స్టార్స్‌ సింగ్‌ బ్రదర్స్‌, బ్యాడ్మింటన్‌ స్టార్‌ పారుపల్లి కశ్యప్‌, ప్రముఖ క్రికెట్‌ వ్యాఖ్యాత హర్షబోగ్లేలు ట్విటర్‌ వేదికగా తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇక ఈ వార్తను నమ్మలేకపోతున్నానని టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ ట్వీట్‌ చేశారు. బ్యాడ్మింటన్‌ స్టార్స్‌ పీవీ సింధూ, సైనా నెహ్వాలు నివాళులర్పించారు.

శ్రీదేవి మరణవార్త విని షాక్‌కు గురయ్యా.. కొద్ది నెలల క్రితమే నా షో సందర్బంగా కలిసా. ఈ వార్తను నమ్మలేకపోతున్నా- సౌరవ్‌ గంగూలీ

శ్రీదేవి మరణవార్త విని దిగ్భ్రాంతి గురయ్యా.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం- వీరేంద్ర సెహ్వాగ్‌

వి మిస్‌ యూ మేడమ్‌.. మీ ఆత్మకు శాంతి చేకూరాలి- సైనా నెహ్వాల్‌

ఈ విషాద వార్తతో షాకయ్యాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి - పీవీ సింధూ

ఐకానిక్‌ నటి శ్రీదేవి మరణ వార్త విని షాక్‌కు గురయ్యా.. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం- వీవీఎస్‌ లక్ష్మణ్‌

శ్రీదేవి ఇక లేరా? ఆమె లేదనే ఈ వార్తా చాలా కష్టంగా ఉంది. ఆమె ఆత్మకు శాంతి కలగాలి- రవిచంద్రన్‌ అశ్విన్‌

శ్రీదేవి మరణం షాక్‌కు గురిచేసింది. ఆమె సన్నిహితులకు, కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సంతాపం- మహ్మద్‌ కైఫ్‌

భారత సినీ చరిత్రలో గొప్ప తారగా వెలిగిన శ్రీదేవి ఆత్మకు శాంతి కలగాలి. మా చిన్నతనంలో ఆమె సినిమాలెన్నో చూశాం- సింగ్‌ బ్రదర్స్‌, రెజ్లింగ్‌ స్టార్స్‌

ఈ చేదువార్త నిజం కాకపోతే బాగుండు.. షాకయ్యా- ఆకాశ్‌ చోప్రా

శ్రీదేవి స్వశక్తితో వెండితెరపై ఓ వెలుగు వెలిగిన ఓ తార.. ఆమె మరణించే వయస్సే కాదిది - ప్రముఖ క్రికెట్‌ వ్యాఖ్యాత హర్షాబోగ్లే 

భారత సినీ పరిశ్రమకు మీరెంతో కృషి చేశారు. మీ అకాల మరణం తీరని నష్టం. మీ ఆత్మకు శాంతి చేకూరాలి- ప్రజ్ఞాన్‌ ఓజా

నా అభిమాన నటి శ్రీదేవి మరణం షాక్‌కు గురిచేసింది. ఆమె కుటుంబ సభ్యులు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి- పారుపల్లి కశ్యప్‌

మరిన్ని వార్తలు