కొత్తగా ‘బ్రోచేవారెవరురా’

21 Mar, 2019 10:28 IST|Sakshi

వైవిధ్యమైన క‌థాంశాల‌తో మెప్పిస్తూ హీరోగా త‌నకంటూ ప్రత్యేక‌త‌ గుర్తింపు తెచ్చుకున్న శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘బ్రోచేవారెవ‌రురా’. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌. మ‌న్యం ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కుమార్ మ‌న్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీవిష్ణుతో పాటు లేటెస్ట్ సెన్సేష‌న్స్ ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ ఈ ఫ‌స్ట్ లుక్ పోస్టర్‌లో క‌న‌ప‌డ‌తున్నారు.

ఈ త్రయం  రంగురంగుల దుస్తులు, షేడ్స్‌తో స్కూట‌ర్ రైడ్ చేస్తున్నట్టుగా ఈ పోస్టర్ డిజైన్ చేశారు. వివేక్ ఆత్రేయ ద‌ర్శక‌త్వంలో శ్రీవిష్ణు హీరోగా రూపొందుతున్న రెండో చిత్రం ‘బ్రోచేవారెవ‌రురా’. ‘చ‌ల‌న‌మే చిత్రము.. చిత్రమే చ‌ల‌న‌ము’ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్‌. శ్రీవిష్ణు స‌ర‌స‌న‌ నివేదా థామ‌స్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా స‌త్యదేవ్‌, నివేదా పేతురాజ్ కీల‌క పాత్రల్లో  న‌టిస్తున్నారు.

యువ సంగీత ద‌ర్శకుడు వివేక్ సాగ‌ర్ సంగీత సార‌థ్యం అందిస్తున్నాడు. చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్షన్ కార్యక్రమాల‌ను జ‌రుపుకుంటుంది. అన్నీ కార్యక్రమాల‌ను పూర్తి చేసి సినిమాను మే నెల‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు