డిఫరెంట్‌ స్టోరీతో..

23 Jun, 2018 01:03 IST|Sakshi
శ్రీవిష్ణు, రోహిత్‌

శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం శుక్రవారం ప్రారంభమైంది. కృష్ణ విజయ్‌ ఎల్‌. దర్శకత్వంలో రిజ్వాన్‌ ఎంటరై్టన్‌మెంట్స్, కృష్ణ విజయ్‌ ఎల్‌. ప్రొడక్షన్స్‌ పతాకాలపై రిజ్వాన్‌ నిర్మిస్తున్నారు. తొలి  సన్నివేశానికి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, హీరో నారా రోహిత్‌ క్లాప్‌ ఇచ్చారు. కృష్ణ విజయ్‌ ఎల్‌. మాట్లాడుతూ– ‘‘అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాదీ ఒకే కథ’ చిత్రాల తర్వాత ఈ సినిమాకు నిర్మాణంలో భాగస్వామ్యం అవడంతో పాటు దర్శకత్వం వహిస్తుండటం హ్యాపీగా ఉంది. జూలైలో షూటింగ్‌ స్టార్ట్‌ చేసి, ఈ ఏడాది చివర్లో సినిమా రిలీజ్‌కు ప్లాన్‌ చేస్తున్నాం’’ అన్నారు.

‘‘విజయ్‌గారితో పని చెయ్యడం హ్యాపీ. ఈ సినిమా అన్ని వర్గాలవారికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు శ్రీవిష్ణు. ‘‘విజయ్‌ ఈ కథ చెప్పినప్పుడు కొత్తగా ఫీల్‌ అయ్యాను. అంత డిఫరెంట్‌గా ఉంది’’ అన్నారు రిజ్వాన్‌. సంగీత దర్శకుడు సురేష్‌ బొబ్బిలి పాల్గొన్నారు. రోహిణి, రఘుబాబు, అచ్చుత్‌ రామారావు, ఏ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి (డైరెక్టర్‌), అజయ్‌ ఘోష్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: శ్రీ ఓం సినిమా, సహ నిర్మాతలు: ఖుర్షీద్‌ (ఖుషి), అచ్చుత్‌ రామారావు, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: మనోజ్‌ మావిల్ల, లైన్‌ ప్రొడ్యూసర్‌: సందీప్‌ గడ్డపు, క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌: వినయ్‌ మాండ్ల, కెమెరా: సిద్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా