ఆ వ్యసనానికి నేను కూడా బానిసనే

5 Sep, 2019 21:12 IST|Sakshi

బ్రోచేవారెవరురా అంటూ హిట్‌ కొట్టిన శ్రీ విష్ణు.. మరో డిఫరెంట్‌ చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమయ్యాడు. మొదట్నుంచీ నటనా ప్రాధాన్యమున్న చిత్రాలను ఎంచుకుంటోన్న శ్రీవిష్ణు.. సక్సెస్‌ అవుతూ వస్తున్నాడు. తిప్పరా మీసం అంటూ మరో విభిన్న కథా చిత్రంతో త్వరలోనే రానున్నాడు.

మందు సిగరెట్‌ అమ్మాయిల్లా.. శత్రువు కూడా వ్యసనమే.. ఆ వ్యసనానికి నేను కూడా బానిసనే అంటూ మొదలైన ఈ టీజర్‌ ఆసక్తికరంగా ఉంది. థ్రిల్లర్‌ మూవీలా కనిపిస్తోన్న ఈ చిత్రంలో శ్రీ విష్ణు లుక్‌ ప్లస్‌ అయ్యేలా కనిపిస్తోంది. రిజ్వాన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. కృష్ణ విజయ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.


 

మరిన్ని వార్తలు