‘ఎవడేమనుకుంటే నాకేంటి.. నేననుకున్నదే చేస్తా’

6 Nov, 2019 14:58 IST|Sakshi

విభిన్న చిత్రాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో శ్రీవిష్ణు ‘తిప్పరా మీసం’అంటూ మరో విభిన్న కథా చిత్రంతో నవంబర్‌ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాది ఒకే కథ, బ్రోచేవారెవరురా సినిమాలతో మెప్పించిన శ్రీ విష్ణు.. ఈసారి ‘తిప్పరా మీసం’ అనే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌తో అలరించనున్నాడు. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్‌ లభించింది. సినిమా విడుదలకు కొన్ని గంటల సమయమే ఉన్నందున ఈ మూవీపై హైప్‌ క్రియేట్‌ చేసేందుకు చిత్ర యూనిట్‌ అన్ని ప్రయత్నాలు మొదలు పెట్టింది. దీనిలో భాగంగా చిత్ర ట్రైలర్‌ను తాజాగా విడుదల చేసింది. 

ట్రైలర్‌ను చూస్తుంటే అ‍మ్మ సెంటిమెంట్‌ ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంది. ‘నా గతాన్ని.. నా సమస్యను గుర్తించని ఈ పనికిమాలిన సమాజం, నేను చేసింది తప్పు అని ఓ ముద్ర వేసింది’, ‘వాడికున్న కోపమంతా వాడి అమ్మమీదే’ ,‘కన్న తల్లిని రోడ్డుకీడ్చిన కొడుకుగా చరిత్రలో నిలిచిపోతావ్‌’, ‘ నిన్ను కన్నందుకు నీ తల్లి బాధపడాలి’, ‘అందరూ నేను అర్థం కాని వెదవనని అనుకుంటారు. కానీ ఎవడేమనుకుంటే నాకేంటి.. నేననుకున్నదే చేస్తా’ అంటూ ట్రైలర్‌లో శ్రీవిష్ణు చెప్పే డైలాగ్‌లు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ చిత్రం భారీ విజయం సాధించడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ట్రైలర్‌లో బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ మామూలుగా లేదు.. పీక్స్‌లో ఉంది.  


 
ఈ చిత్రానికి ‘అసుర’తో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కృష్ణ విజయ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీవిష్ణు సరసన నిక్కి తంబోలి హీరోయిన్‌గా నటిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతమందిస్తున్న ఈసినిమాకు సిధ్‌ సినిటోగ్రాఫర్‌. రిజ్వాన్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌తో కలిసి దర్శకుడు కృష్ణ విజయ్‌ ఎల్ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

మరిన్ని వార్తలు