బ్రోచేవారెవరురా థ్యాంక్స్‌ మీట్‌

2 Jul, 2019 12:41 IST|Sakshi

శ్రీవిష్ణు, నివేదా థామ‌స్ ప్రధాన పాత్రల్లో   వివేక్ ఆత్రేయ ద‌ర్శక‌త్వంలో తెరకెక్కిన సినిమా బ్రోచేవారెవ‌రురా. సత్యదేవ్, నివేతా పేతురాజ్, రాహుల్ రామక్రిష్ణ, ప్రియదర్శి ఇతర ప్రధాన పాత్రలో నటించారు. విజ‌య్‌కుమార్ మ‌న్యం నిర్మించిన ఈ సినిమా జూన్ 28న విడుదలై భారీ వసూళ్లు సాధిస్తూ దూపసుకుపోతోంది. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ థాంక్స్ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంల్లో ముఖ్య అతిథులుగా దర్శకులు శివ నిర్వాణ,  తరుణ్ భాస్కర్  పాల్గొన్నారు.

హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ‘మా సినిమాను అంద‌రూ చూసి చాలా బావుంద‌న్నారు. సురేష్‌ బాబు గారు మెచ్చుకున్నారు. ప్రీ రిలీజ్‌కి రామ్‌ గారు, రోహిత్‌ గారు వ‌చ్చారు. దాని వ‌ల్ల అంద‌రికీ రీచ్ అయింది. ముందు రోజు నానిగారు చూసి బావుంద‌ని చెప్పడంతో అంద‌రూ థియేట‌ర్ల‌కు వ‌చ్చి మెచ్చుకోవ‌డం ఆనందంగా ఉంది. సినిమాను పైర‌సీలో చూడొద్దు. మంచి థియేట‌ర్లో చూస్తే బావుంటుంది’ అన్నారు.

దర్శకుడు వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ ‘ఆడియ‌న్స్‌కి ధ‌న్యవాదాలు. ప్రెస్ వాళ్లంద‌రూ ఫోన్ చేసి సినిమా గురించి ప్రశంసించారు. ప్రతీ ఒక్కరూ బాగా చేశారు. ఇది మా టీం అందరి సమిష్టి కృషితో సాధించిన విజయం. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్’ అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగ‌ర్ మాట్లాడుతూ ‘వివేక్ చాలా మంచి స్టోరీ రాసుకున్నారు. నిర్మాత‌కు తొలి సినిమాకే ఇంత పెద్ద హిట్ రావ‌డం ఆనందంగా ఉంది. ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ బావుంది. మా లిరిసిస్ట్‌లు అంద‌రికీ ధ‌న్యవాదాలు. సౌండ్ డిజైన్ చాలా బావుంది’ అన్నారు.

నటుడు ప్రియ‌ద‌ర్శి మాట్లాడుతూ ‘సినిమా చాలా బావుంది. గ‌త రెండు, మూడు వారాలుగా థియేట‌ర్లలో చాలా మంచి సినిమాలు వ‌స్తున్నాయి. ఆడియ‌న్స్ ఇలాంటి సినిమాలు చూడ‌బ‌ట్టే కొత్త సినిమాల‌తో మేం కూడా ముందుకొస్తున్నాం. వివేక్ చాలా జీనియ‌స్. నిర్మాత సినిమా మీద ఇంత ప్యాష‌న్‌తో చేసినందుకు థాంక్స్. నా పాత్రను చూసి అంద‌రూ న‌వ్వుతుంటే చాలా ఆనందంగా ఉంది’  అన్నారు .

నిర్మాత విజ‌య్‌కుమార్ మ‌న్యం మాట్లాడుతూ ‘సినిమా చూసి ఎంక‌రేజ్ చేసిన ప్రేక్షకులంద‌రికీ హృద‌య‌ పూర్వక ధ‌న్యవాదాలు. అనిల్‌రావిపూడి, త‌రుణ్‌ భాస్కర్‌, రామ్‌, సురేశ్‌బాబు గారు, నానిగారు, వెంక‌టేశ్‌గారు, కె.టి.ఆర్‌గారు స‌హా అంద‌రికీ థాంక్స్. మంచి క‌లెక్షన్లు రావ‌డానికి, మంచి ఓపెనింగ్స్ రావ‌డానికి మంచి రివ్యూలు దోహ‌ద‌ప‌డ్డాయి. ప్రతీ రివ్యూలోనూ మా టీమ్‌ని ప్రశంసించినందుకు ధ‌న్యవాదాలు’ అన్నారు.

దర్శకుడు త‌రుణ్ భాస్కర్ మాట్లాడుతూ ‘2019లో నాకు న‌చ్చిన సినిమా అని చాలా మంది చెప్పారు. నాకు టిక్కెట్లు దొర‌క‌లేదు. వివేక్ నాకు ఒక టికెట్ ఇప్పిస్తే బావుంటుంది. నేను రేపు 11కి ఏఎంబీలో చూస్తాను. మ‌న‌స్ఫూర్తిగా చెప్పాలంటే వివేక్ ఆత్రేయ‌కి ఇది వెల్ డిస‌ర్వ్డ్ స‌క్సెస్‌. ఆయ‌న ప్రతీ డీటైల్‌ను కేర్ ఫుల్‌గా చేశారు. ఆయ‌న ద‌గ్గర చాలా నేర్చుకోవాలి నేను. త‌న ప‌ర్సన‌ల్ జ‌ర్నీ కూడా నాకు తెలుసు. ఆయన ఇలాంటి సినిమాలు మరెన్నో తీయాలి’ అన్నారు.

దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ ‘నేను కథ రాసేట‌ప్పుడు హ్యూమ‌ర్ రావాలంటే దీన్ని పారామీట‌ర్‌గా తీసుకోవాల‌ని అనుకుంటున్నాను. ఇటీవ‌ల నేను, వివేక్‌, గౌత‌మ్ తిన్ననూరి ఓ ఇంట‌ర్వ్యూ ఇచ్చాం. అందులో భాగంగా వివేక్‌ని నెక్స్ట్ ఏ సినిమా తీయ‌బోతున్నారు అని అడిగితే ‘ఏదైనా నా స్ట్రగుల్‌, నా పెయిన్ నుంచి వ‌స్తుంది’ అని చెప్పాడు. త‌ను అలా చెప్పడం నాకు న‌చ్చింది. సెకండ్ ఫిల్మ్ అనేస‌రికి ఆబ్లిగేష‌న్‌లో ప‌డ‌కుండా, అడ్వాన్సుల్లో ప‌డ‌కుండా ఉండ‌టం చాలా ఆనందంగా ఉంది.

నివేదాకు క్లాసిక‌ల్ డ్యాన్స్ బాగా వ‌చ్చు. నేను నిన్నుకోరిలో పిచ్చిపిచ్చిగా చేయించాను. ఈ సినిమాలో చాలా బాగా చేసింది. ఈ సినిమాలో క‌థ బావుండాల‌ని అంద‌రూ కృషి చేశారు. అదే ఈ సినిమాకు పెద్ద స‌క్సెస్‌. ఇప్పటిదాకా శ్రీవిష్ణు చేసిన సినిమాల్లోకి ఈ సినిమా పెద్ద స‌క్సెస్ అని అనిపించింది’ అన్నారు.

మరిన్ని వార్తలు