జెమిని టీవీలో... శ్రీ ఆంజనేయం

6 May, 2016 00:41 IST|Sakshi
జెమిని టీవీలో... శ్రీ ఆంజనేయం

రామాయణం.. ఇందులో చిన్నవాళ్ల నుంచీ పెద్దవాళ్ల వరకూ అందర్నీ ఆంజనేయుని పాత్ర ఆకట్టుకుంటుం ది. ఈ హనుమంతుని చుట్టూ ఎన్నో కథలు, సీరియల్స్ వచ్చాయి. అందులో ఎక్కువ శాతం రామాయణ కాలంలోని హనుమాన్ పాత్ర గురించి వచ్చినవే. కానీ, దాని తర్వాత చిరంజీవిగా ఉన్న ఆంజనేయుని చరిత్ర చాలామందికి తెలియదు.

ఈ చరిత్రనే జెమిని టీవీ  ‘శ్రీ ఆంజనేయం’ అనే మెగా సీరియల్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానుంది. మే 9న ఆరంభమయ్యే ఈ సీరియల్ సోమవారం నుంచి శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు ప్రసారం అవుతుంది. ఇందులో అద్భుతమైన కథ, కథనమే కాదు, అబ్బురపరిచే గ్రాఫిక్స్ కూడా ఉంటాయి. ఈ సీరియల్ వేసవిలో పిల్లలకు మంచి వినోదం అందించబోతోంది అనడంలో సందేహమే లేదు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి