అమలాపాల్‌ రెండో పెళ్లిపై స్పందించిన శ్రీరెడ్డి

1 Apr, 2020 08:50 IST|Sakshi

నటులపై, దర్శకులపై ఘాటు విమర్శలతో నిత్యం వార్తల్లో నిలిచే సంచలన నటి శ్రీరెడ్డి తాజాగా అమలాపాల్‌ రెండవ పెళ్లిపై స్పందించారు. నీ పంజాబీ భర్త మంచివాడే, భయపడొద్దు అమలాపాల్‌.. అంటూ సోషల్‌ మీడియా పోస్ట్‌ చేశారు. ఈ మేరకు ‘‘బాధపడకు అమలాపాల్‌.. నీ పంజాబీ భర్త బాగానే చూసుకుంటాడు. నాకు పంజాబీలపై నమ్మకం ఉంది.’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై అమలాపాల్‌ అభిమానులు మండిపడుతున్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారీ నేపథ్యంలో ప్రజలు భయాందోళన చెందుతున్న సమయంలో శ్రీరెడ్డి ఇలాంటి పోస్టులు చేయడం అవసరమా అంటూ విమర్శిస్తున్నారు. (శ్రీరెడ్డి కేసు.. డ్యాన్స్‌ మాస్టర్‌కు వింత చిక్కు..)


కాగా ఇటీవల నటి అమలాపాల్‌.. ప్రియుడు, ముంబైకు చెందిన గాయకుడు భవ్నీందర్‌ సింగ్‌ను వివాహం చేసుకున్నట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ వార్తలు కాస్తా సోషల్‌ మీడియాలో వైరలవ్వడంతో దీనిపై స్పందించిన అమలాపాల్‌ తనకు వివాహం జరగలేదని, అవి కేవలం ఫోటోషూట్‌ కోసం దిగిన ఫోటోలని స్పష్టం చేశారు. ఇక అమలాపాల్‌ 2014లో దర్శకుడు ఏఎల్‌ విజయ్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అనంతరం కొన్ని కారణాలతో విడాకులు తీసుకున్నారు. ఈ తర్వాత విజయ్‌ మరో వివాహం చేసుకున్నారు. (ప్రియుడిని పెళ్లి చేసుకున్న అమలాపాల్‌)

(రెండో పెళ్లి చేసుకోలేదు.. అవి ఫోటో షూట్ అంతే)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా