ఎన్టీఆర్‌పై శ్రీరెడ్డి కామెంట్స్‌..

27 Jun, 2018 18:42 IST|Sakshi

టాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌పై పోరాటం చేస్తూ సంచలనం సృష్టించింది నటి శ్రీరెడ్డి. ఆమె ఇటీవల సినీ ప్రముఖులపై విమర్శలు చేసి వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు చేశారు. ‘ టు దిస్‌ జనరేషన్‌ జూనియర్‌ ఎన్టీఆర్ ఈజ్‌ కింగ్‌ ఆఫ్‌ ఎ టాలీవుడ్‌. బిగ్‌బాస్‌కు ఎన్టీఆర్‌ సింహం’ అని పోస్టులో పేర్కొన్నారు. ఎన్టీఆర్‌పై శ్రీరెడ్డి గతంలో కూడా ప్రశంసలు కురిపించారు. ‘జూనియర్‌ ఎన్టీఆర్‌ను బిగ్‌బాస్‌ షోలో అందరూ మిస్‌ అవుతున్నారు. ఎన్టీఆర్‌ స్థానాన్ని ఎవరూ రిప్లేస్‌ చేయలేరు. అతని రాకతో ప్రజలు నిరాశలో ఉన్నారు. సాహో యంగ్‌ టైగర్‌’ అని తన ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు.

ఇటీవల హీరో నానిని కూడా శ్రీరెడ్డి విమర్శించిన విషయం విదితమే. అంతేకాక నాని తనను బిగ్‌బాస్‌లో పాల్గొనకుండా చేశారని ఆరోపించారు. దీనిపై నాని శ్రీరెడ్డికి లీగల్‌ నోటిసులు పంపారు. అయితే ఈ విషయంపై న్యాయస్థానంలోనే  తేల్చుకుందామని శ్రీరెడ్డి సవాలు విసిరారు. ప్రస్తుతం నాని బిగ్‌బాస్‌ సీజన్‌2 కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా