దొంగల రారాజు

1 Mar, 2020 04:48 IST|Sakshi

వెరైటీ కథలను ఎంచుకొని నటించే నటుల్లో శ్రీవిష్ణు ఒకరు. శనివారం ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా తన నూతన చిత్రం ‘రాజ రాజ చోర’ తొలి ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ‘రాజ రాజ చోర’ అంటే దొంగలందరికీ రాజు లాంటివాడు అని అర్థం. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న  ఈ చిత్రం ద్వారా హసిత్‌ గోలి దర్శకునిగా పరిచయమవుతున్నారు. సునయన కథానాయిక. చిత్రనిర్మాతలు టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌  మాట్లాడుతూ– ‘‘శ్రీవిష్ణు, హసిత్‌ గోలి లాంటి ఇద్దరు యువ ప్రతిభావంతులతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడం, మా హీరో శ్రీవిష్ణు పుట్టినరోజు సందర్భంగా ప్రచార చిత్రాన్ని విడుదల చేయటం ఆనందంగా ఉంది. ఏప్రిల్‌ నాటికి ఈ చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: వివేక్‌ సాగర్, క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌: కీర్తి చౌదరి, సహనిర్మాత: వివేక్‌ కూచిభొట్ల.

మరిన్ని వార్తలు