-

‘జాన్వీ’ కోసం శ్రీదేవి-బోనీ ఎంతలా ఆలోచించారంటే?

13 May, 2020 12:44 IST|Sakshi

తల్లిదండ్రులు తమ పిల్లలకు పేర్లు పెట్టడానికి చిన్నపాటి యుద్దమే చేస్తారు. జనరేషన్‌కు అనుగుణంగా పెద్దయ్యాక తమను తిట్టుకోకుండా ఉండేలా పిల్లలకు సూటయ్యేలా పేర్లను ఎంపిక చేస్తారు. ఇక ఇలాంటి అనుభవమే అతిలోకసుందరి శ్రీదేవి-నిర్మాత బోనీ కపూర్‌ దంపతులకు కూడా ఎదురైంది. మార్చి 6, 1997న పుట్టిన తమ తొలి సంతానానికి ఏ పేరు పెట్టాలని తీవ్రంగా ఆలోచించారంట ఈ దంపతులు. అయితే అప్పుడే (1997) తను నటించిన, తన భర్త నిర్మించిన ‘జుడాయి’ చిత్రంలోని ఓ పాత్ర శ్రీదేవిని చాలా ఆకర్శించిందంటా. ఆ చిత్రంలోని ఆ పాత్ర ప్రేరణతోనే తమ కూతురికి ‘జాన్వీ’ అనే పేరు పెట్టాలని డిసైడ్‌ అయ్యారంట. 

అనిల్‌ కపూర్‌, శ్రీదేవి, ఊర్మిలా మటోండ్కర్‌ ప్రధాన పాత్రల్లో వచ్చిన బాలీవుడ్‌ చిత్రం ‘జుడాయి’. ఈ చిత్రంలో ఊర్మిలా పాత్ర పేరు జాన్వీ. ‘జుడాయి’ సినిమాలోని జాన్వీ పాత్ర శ్రీదేవి, బోనీ కపూర్‌లకు ఎంతో నచ్చిందంట, అంతేకాకుండా వారికి ఎంతో ప్రేరణ కలిగించిందట. దీంతో తమ తొలి సంతానానికి జాన్వీ అని నామకణం చేశామని ఓ ఇంటర్వ్యూలో ఈ దంపతులు పేర్కొన్న విషయం తెలసిందే. ‘దడఖ్‌’ చిత్రంతో తెరంగేట్రం చేసిన జాన్వీ కపూర్‌ తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం అరడజను సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్న జాన్వీకి తన తల్లి శ్రీదేవితో మంచి అటాచ్‌మెంట్‌ ఉంది. మదర్స్‌డే సందర్భంగా తన తల్లిని స్మరించుకుంటూ సోషల్‌ మీడియాలో చేసిన ఓ పోస్ట్‌ అందరినీ భావోద్వేగానికి గురిచేసింది.  

చదవండి: 
విరాటపర్వం: సాయిపల్లవి నక్సలైట్‌ కాదు!
శ్రీమతితో తొలి సెల్ఫీ.. వైరల్‌

❤️

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

మరిన్ని వార్తలు