‘మా నమ్మకాన్ని మరింత పెంచింది’

21 May, 2019 13:03 IST|Sakshi

పబ్లిక్ స్టార్ శ్రీకాంత్ కీలక పాత్రలో అభయ్‌ని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిత్రం ‘మార్షల్’. ఏవీఎల్‌ ప్రొడక్షన్స్ పతాకంపై జై రాజ సింగ్ దర్శకత్వంలో అభయ్ అడక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేఘ చౌదరి హీరొయిన్ గా నటిస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం టీజర్ ఈనెల 5న తలసాని గారి చేతులమీదగా విడుదలైంది. ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. విడుదలైన గంటల్లో హాఫ్ మిలియన్ వ్యూస్ రాబట్టి ఈ టీజర్‌ అదే దూకుడుతో 2 మిలియన్ వ్యూస్ సాధించింది. 

ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. ‘ఇప్పటికే 20 లక్షల వ్యూస్ రావడం.. ఈ చిత్రంపై ముందు నుంచి మాకు గల నమ్మకాన్ని మరింత పెంచింది. ఇటీవల కాలంలో ట్రెండ్ సిట్టింగ్ హిట్స్ గా నిలిచిన చిత్రాల జాబితాలో మా ‘మార్షల్’ కూడా కచ్చితంగా స్థానం పొందుతుందన్న నమ్మకం ఉంది’ అన్నారు.

మరిన్ని వార్తలు