సమాజానికి సందేశం

14 Feb, 2019 02:57 IST|Sakshi
శ్రీకాంత్‌, అభయ్‌

అభయ్‌ హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘మార్షల్‌’. జై రాజసింగ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీకాంత్‌ విభిన్న పాత్ర పోషించారు. మేఘా చౌదరి కథానాయిక. ఏవీఎల్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై అభయ్‌ అడకా నిర్మించిన ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలకు సిద్ధమవుతోంది. జై రాజసింగ్‌ మాట్లాడుతూ– ‘‘ఈ ఏడాది విభిన్నంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా ‘మార్షల్‌’. అభయ్‌ అడకా పాత్ర హుందాగా, కొత్తగా ఉంటుంది. శ్రీకాంత్‌ మంచి పాత్ర చేశారు. ఆర్‌.యం. స్వామి సినిమాటోగ్రఫీ, యాదగిరి వరికుప్పల సంగీతం, నాభ, సుబ్బుల ఫైట్స్‌ ఎసెట్స్‌గా నిలుస్తాయి’’ అన్నారు. ‘‘వైవిధ్యభరితమైన చిత్రం ‘మార్షల్‌’. మంచి సందేశం కూడా ఉంటుంది. త్వరలో పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి చేసి, సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం’’ అని అభయ్‌ అడకా అన్నారు. 

మరిన్ని వార్తలు