వినోదం పంచే ఎర్రచీర

2 Jul, 2019 05:50 IST|Sakshi
శ్రీకాంత్‌

హారర్, యాక్షన్, సస్పెన్స్‌ ప్రధానంగా రూపొందుతున్న చిత్రం ‘ఎర్రచీర’. సత్య సుమన్‌బాబు దర్శకత్వం వహిస్తున్నారు. బేబీ ఢమరి సమర్పణలో శ్రీ సుమన్‌ వెంకటాద్రి ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాలో హీరో శ్రీకాంత్‌ ఓ కీలక పాత్రలో నటించనున్నారు. సత్య సుమన్‌బాబు మాట్లాడుతూ– ‘‘ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. చేజింగ్, హారర్, కామెడీ సన్నివేశాలు అబ్బురపరుస్తాయి. శతాధిక చిత్రాల హీరో శ్రీకాంత్‌ నటించడం మా సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. ఆయన పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. శ్రీరాం, అలీ పాత్రలు ఆకట్టుకుంటాయి’’ అన్నారు. ‘‘బడ్జెట్‌ పరంగా ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్‌ మొదటి వారంలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత తోట సతీష్‌ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: చందు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు