సూపర్ స్టార్కు విలన్గా ఫ్యామిలీ హీరో

12 Feb, 2017 12:40 IST|Sakshi
సూపర్ స్టార్కు విలన్గా ఫ్యామిలీ హీరో

సీనియర్ హీరోలందరూ ఇప్పుడు కొత్త రూట్లు వెతుక్కుంటున్నారు. వయసైపోయిన హీరోలందరూ క్యారెక్టర్ ఆర్టిస్ట్లుగా మారిపోతుంటే ఇప్పటికీ హ్యండ్సమ్గా కనిపిస్తున్న సీనియర్ హీరోలు విలన్ రోల్స్కు సై అంటున్నారు. ఇప్పటికే జగపతిబాబు విలన్గా ఆకట్టుకోగా ఇప్పుడు మరో సీనియర్ హీరో అదే బాటలో నడిచేందుకు రెడీ అవుతున్నాడు.

ఫ్యామిలీ హీరోగా టాలీవుడ్లో మంచి విజయాలు సాధించిన శ్రీకాంత్ ప్రస్తుతం హీరోగా ఆకట్టుకోలేక పోతున్నాడు. దీంతో విలన్గా కెరీర్ను స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. అంతేకాదు తొలి సినిమానే ఓ సూపర్ స్టార్కు ప్రతినాయకుడిగా నటించేందుకు రెడీ అవుతున్నాడు. మలయాళ స్టార్ హీరో మోహన్లాల్ హీరోగా తెరకెక్కుతున్న మలయాళ సినిమాలో శ్రీకాంత్ విలన్గా మారుతున్నాడు. ఈ సినిమాలో శ్రీకాంత్ తో పాటు కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ మరో విలన్ గా నటిస్తున్నాడు.

కెరీర్ స్టార్టింగ్లో విలన్గా పలు చిత్రాల్లో నటించిన శ్రీకాంత్, హీరోగా మారాక ఒక్క సినిమాలో కూడా నెగెటివ్ రోల్లో కనిపించలేదు. ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్కు దగ్గరైన ఈ హ్యండ్సమ్ హీరో ఇప్పుడు మరోసారి నెగెటివ్ రోల్లో నటిస్తుండటంతో ఆ సినిమాపై మాలీవుడ్తో పాటు టాలీవుడ్లో కూడా హైప్ క్రియేట్ అవుతోంది. ఈ సినిమాతో తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.