నిర్మలా కాన్వెంట్‌లో శ్రీకాంత్ వాళ్ళబ్బాయి

21 Jan, 2016 22:49 IST|Sakshi
నిర్మలా కాన్వెంట్‌లో శ్రీకాంత్ వాళ్ళబ్బాయి

 హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా పరిచయమవుతున్న ‘నిర్మలా కాన్వెంట్’ చిత్రం సెలైంట్‌గా షూటింగ్ జరుపుకొంటోంది. హీరో నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్ కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం. జి. నాగకోటేశ్వరరావు దర్శకునిగా పరిచయమవుతున్నారు. ‘దూకుడు’ తదితర చిత్రాల్లో బాలనటిగా చేసిన శ్రేయాశర్మ ఇందులో నాయిక. నాగార్జున ఇందులో ప్రత్యేక పాత్ర చేయనున్నారు. ఫిబ్రవరిలో ఆయన వెర్షన్ షూటింగ్‌తో సినిమా పూర్తవుతుందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: రోషన్ సాలూరి, కెమెరా: ఎస్.వి విశ్వేశ్వర్.