అసలు రిలేషన్‌షిప్ మొదలైంది: శ్రీముఖి

7 Dec, 2019 20:54 IST|Sakshi

రియాలిటీ షో బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-3 రన్నరప్‌ శ్రీముఖి తన అభిమానులకు స్వీట్‌ షాకిచ్చారు. బిగ్‌బాస్‌ విజేత, సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌తో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. దానికి... ‘గతం గతః.. అసలు రిలేషన్‌షిప్‌ ఇప్పుడే మొదలైంది’ అంటూ క్యాప్షన్‌తో పాటుగా హార్ట్‌ సింబల్‌ను జత చేశారు. అంతేకాదు రాహుల్‌ సైతం శ్రీముఖి షేర్‌ చేసిన ఫొటోను రీపోస్ట్‌ చేయడం విశేషం. ఈ క్రమంలో శ్రీముఖి- రాహుల్‌ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. మీరిద్దరు ఇలా కలిసిపోవడం బాగుందంటూ కొంతమంది కామెంట్లు చేస్తుండగా... మరి పున్ను సంగతి ఏంటి రాహుల్‌ అంటూ మరికొందరు తమదైన శైలిలో రాహుల్‌కు ప్రశ్నలు సంధిస్తున్నారు.

కాగా బిగ్‌బాస్‌లో మొదటి నుంచి స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌గా ఉన్న శ్రీముఖి రెండో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఫేక్‌ ఎలిమినేషన్‌కు గురై... చివరి సమయంలో పుంజుకున్న రాహుల్‌ సిప్లిగంజ్‌ టైటిల్‌ను దక్కించుకుని సత్తా చాటాడు. రాహుల్‌ కన్నా అన్ని విషయాల్లో తనే బెటర్‌ అనుకున్న శ్రీముఖి రన్నరప్‌కే పరిమితమవడాన్ని ఆమెతో సహా అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలో బిగ్‌బాస్‌ షో ముగింపు సందర్భంగా ప్రేక్షకుల సమక్షంలోనే ఆమె తన మనసులో మాట బయటపెట్టారు. హోస్ట్‌ నాగార్జున రాహుల్‌ను విజేతగా ప్రకటించగానే ముందుగా శ్రీముఖిని మాట్లాడమని సూచించాడు. శ్రీముఖి మాట్లాడుతూ.. ‘ఓటమిని ఎవరూ ఇష్టపడరు. ముఖ్యంగా నేను’ అంటూ తన బాధను వ్యక్తం చేశారు. అయితే ఎంతోమంది హృదయాలను గెలుచుకున్నానందుకు సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. షో అనంతరం ఫ్రెండ్స్‌తో కలిసి టూర్‌ వెళ్లిన శ్రీముఖి.. తన దృష్టిలో బాబా భాస్కరే నిజమైన విజేత అంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రాహుల్‌తో ఉన్న ఫొటోను షేర్‌ చేయడంతో నెటిజన్లు తికమకపడుతున్నారు.

#Repost @sipligunjrahul @get_repost . . . Gatham Gathaha! Asalu relationship ipudu modalaindi! @sreemukhi ❤️

A post shared by Sreemukhi (@sreemukhi) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు