శ్రీనువైట్లకు హీరో దొరికాడా..?

30 Aug, 2017 11:49 IST|Sakshi
శ్రీనువైట్లకు హీరో దొరికాడా..?

ఒకప్పుడు స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన దర్శకుడు శ్రీనువైట్ల, వరుసగా మూడు ఫ్లాప్ లు వచ్చే సరికి పూర్తిగా డీలా పడిపోయాడు. ఆగడు, బ్రూస్ లీ, మిస్టర్ సినిమాలతో నిరాశపరిచిన శ్రీనువైట్ల కొంత కాలంగా నెక్ట్స్ సినిమా కోసం కథా కథనాలు సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో శ్రీనువైట్ల తో సినిమా చేసే హీరో ఎవరన్న చర్చ జరుగుతోంది.

అయితే శ్రీనువైట్ల దర్శకత్వంలో సినిమా చేసేందుకు రవితేజ ముందుక వచ్చాడన్న టాక్ వినిపిస్తోంది. నీ కోసం సినిమాతో తనకు హీరోగా తొలి అవకాశం ఇచ్చిన శ్రీనువైట్ల కోసం రవితేజ ఈ నిర్ణయం తీసుకున్నాడన్న ప్రచారం జరుగుతోంది. వీరి కాంబినేషన్ లో వచ్చిన వెంకీ, దుబాయ్ శీను సినిమాను మంచి సక్సెస్ సాధించటంతో మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి