రవితేజ..  శ్రీను వైట్ల.. మైత్రి!

11 Jan, 2018 00:00 IST|Sakshi

మైత్రీ కుదిరింది. అవును రవితేజ, శ్రీను వైట్లకు మైత్రీ కుదిరింది. ఇప్పుడేంటి? ఎప్పటి నుంచో ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది కదా. ‘నీ కోసం’, ‘వెంకీ’, ‘దుబాయ్‌ శీను’.. ఇలా వీళ్ల కాంబినేషన్‌లో సినిమాలు వచ్చాయి కదా అనుకుంటున్నారా! విషయం ఏంటంటే.. రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ ఓ సినిమా నిర్మించనుంది. వై. రవిశంకర్, ఎర్నేని నవీన్, చెరుకూరి మోహన్‌ నిర్మాతలు. త్వరలో ఈ చిత్రం షూటింగ్‌ ఆరంభం కానుందట. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోందని సమాచారం.

కథానుగుణంగా ఎక్కువ శాతం షూటింగ్‌ను అమెరికాలో జరపడానికి ప్లాన్‌ చేశారని భోగట్టా. ఇదిలా ఉంటే.. రవితేజ–శ్రీను వైట్ల చివరి సినిమా ‘దుబాయ్‌ శీను’ విడుదలైంది 2007లో. వీళ్ల కాంబినేషన్‌లో రూపొందిన మూడు సినిమాలూ హిట్టే. సో.. పదేళ్ల తర్వాత మరో హిట్‌ కోసం ఈ కాంబినేషన్‌ రెడీ అయిందన్న మాట. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు