మహేశ్‌ మేనల్లుడు హీరో

8 Nov, 2019 03:22 IST|Sakshi
అశోక్‌ గల్లా

హీరో మహేశ్‌బాబు బావ, గుంటూరు పార్లమెంట్‌ సభ్యుడు జయదేవ్‌ గల్లా తనయుడు అశోక్‌ గల్లా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ‘భలే మంచి రోజు, శమంతక మణి, దేవదాస్‌’ చిత్రాలతో కమర్షియల్‌ హిట్స్‌ దక్కించుకున్న శ్రీరామ్‌ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. అమర్‌రాజా మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై పద్మావతి గల్లా నిర్మించనున్న ఈ సినిమా ఈ నెల 10న హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. తనదైన స్టైల్‌లో డిఫరెంట్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు శ్రీరామ్‌ ఆదిత్య. నరేశ్, సత్య, అర్చనా సౌందర్య తదితరులు నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, కెమెరా: రిచర్డ్‌ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చంద్రశేఖర్‌ రావిపాటి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా