ఆమెకు దానిపై ఆశ పుట్టింది

14 Feb, 2020 11:58 IST|Sakshi

సినిమా: నటి సృష్టిడాంగేకు పెళ్లిపై ఆశ పుట్టినట్లుంది. మెగా చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయిన ఉత్తరాది బ్యూటీ సృష్టిడాంగే. ఆ తరువాత చాలా చిత్రాల్లో నటించింది. ఇప్పటికీ నటిస్తూనే ఉంది. అయితే ఇంకా స్టార్‌డమ్‌ను అందుకోలేదు. అందుకోసమే తపిస్తోంది. తన నట జీవితంలో గుర్తుండిపోయే కథా పాత్ర కోసం ఎదురుచూస్తోంది. అయితే  అలాగని వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోవడం లేదు. ఏ పుట్టలో ఏ పాము ఉంటుందోనన్న చందంగా వచ్చిన అవకాశాన్ని  సద్వినియోగం చేసుకునే ప్రయత్నంలో ఉంది. అలా ఆ మధ్య విజయ్‌సేతుపతితో కలిసి నటించిన ధర్మదురై చిత్రంలో తన నటనకు మంచి పేరు వచ్చింది. అదే విధంగా ఇటీవల దర్శకుడు చేరన్‌ ప్రధాన పాత్రలో నటించిన రాజావుక్కు చెక్‌ చిత్రంలో నగ్నంగా నటించి చర్చనీయాంశంగా మారింది.

అలా స్టార్‌ హీరోలతో జత కట్టే అవకాశాలు వరించకపోయినా, వరుసగా  చిత్రాల్లో నటిస్తూనే ఉంది. తమిళంతో పాటు, కన్నడం ఇతర భాషల్లోనూ నటిస్తూ బహుభాషా నటిగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఆరికి జంటగా కొత్త చిత్రంలో నటిస్తోంది. కట్టిల్‌ అనే మరో చిత్రాన్ని ఇటీవలే పూర్తి చేసింది. ఈ చిత్రంలో నటించిన అనుభవం గురించి నటి సృష్టిడాంగే చెబుతూ ఈ చిత్రం ద్వారా తనకు తెలియని తమిళ సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకున్నానని చెప్పింది. దీంతో తమిళ సంప్రదాయంపై ప్రేమను ఇంకా పెంచేసిందని అంది. అది ఎంత వరకు అంటే తమిళ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలన్నంత ఆశ కలిగిందని ఈ ముంబై భామ చెప్పుకొచ్చింది. సృష్టిడాంగే చెబుతున్నదాంట్లో నిజం ఎంత అన్నది నెటిజన్లు ఆరా లాగే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదో పబ్లిసిటీ స్టంటా లేక ఆమెకు పెళ్లిపై దృష్టి మళ్లిందా అన్న చర్చ కూడా సినీ వర్గాల్లో జరుగుతోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కరోనా విరాళం

కూతురి కోసం...

తమ్మారెడ్డి భరద్వాజకు మాతృ వియోగం

శ్రీలక్ష్మి కనకాల ఇకలేరు

నీలి నీలి ఆకాశం @ 10 కోట్లు!

సినిమా

కరోనా విరాళం

కూతురి కోసం...

తమ్మారెడ్డి భరద్వాజకు మాతృ వియోగం

శ్రీలక్ష్మి కనకాల ఇకలేరు

నీలి నీలి ఆకాశం @ 10 కోట్లు!

ఒక్కరికైనా సాయపడండి