చీఫ్‌ గెస్ట్‌గా రానున్న రాజమౌళి

21 Dec, 2019 15:21 IST|Sakshi

‘మత్తు వదలరా’ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ముఖ్య అతిథిగా రాబోతున్నారు. టాలీవుడ్‌ సంగీత దిగ్గజం ఎమ్‌ఎమ్‌ కీరవాణి తనయుడు శ్రీసింహా హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘మత్తు వదలరా’. షూటింగ్‌ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇప్పటికే వినూత్నంగా పమోషన్స్‌ మొదలుపెట్టిన చిత్రయూనిట్‌.. తాజాగా మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించాలనే ఆలోచనలో ఉంది. దీనిలో భాగంగా ఈ ఈవెంట్‌కు రాజమౌళిని ముఖ్య అతిథిగా ఆహ్వానించగా ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో శనివారం హైదరాబాద్‌లో జరిగబోయే ఈవెంట్‌కు రాజమౌళి చీఫ్‌ గెస్ట్‌గా రానున్నట్లు చిత్ర సభ్యులు అధికారికంగా ప్రకటించారు. 

ఇక సొంత కుటుంబానికి చెందిన మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు రాజమౌళి ముఖ్య అతిథిగా రావడంలో ప్రత్యేక విశేషం లేనప్పటికి.. ఆయన రాకతో సినిమాకు మరింత ప్లస్‌ అవుతుందుని టాలీవుడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.  రితేష్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మాతలు. కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ సంగీతదర్శకుడు. నరేశ్‌ అగస్త్య, అతుల్య చంద్ర, వెన్నెల కిశోర్‌, సత్య, బ్రహ్మాజీ, తదితరులు నటిస్తున్న ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కరోనా: పాట పాడిన చిరంజీవి, నాగ్‌

క్వారంటైన్‌ లైఫ్‌.. చేతికొచ్చిన పంట మాదిరి..

వైరల్‌: మంచు లక్ష్మీని టార్గెట్‌ చేసిన ఆర్‌జీవీ!

కరోనా విరాళం

అంతా బాగానే ఉంది

సినిమా

కరోనా: పాట పాడిన చిరంజీవి, నాగ్‌

క్వారంటైన్‌ లైఫ్‌.. చేతికొచ్చిన పంట మాదిరి..

వైరల్‌: మంచు లక్ష్మీని టార్గెట్‌ చేసిన ఆర్‌జీవీ!

కరోనా విరాళం

అంతా బాగానే ఉంది

నేను బాగానే ఉన్నాను