ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లకు జక్కన్న ఛాలెంజ్‌

20 Apr, 2020 17:57 IST|Sakshi

లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలంతా ఇంటి పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. అంతేగాక క్వారంటైన్‌లో ఖాళీగా ఉండకుండా కుటుంబ సభ్యులకు సాయంగా ఉండాలంటూ మిగతా సెలబ్రిటీలకు సైతం సవాలు విసురుతున్నారు. ఈ క్రమంలో దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి.. జూనియర్‌ ఎన్టీఆర్‌ రామ్‌చరణ్‌లకు సవాలు విసిరారు. అంతేగాక బాహుబలి నిర్మాతలకు, ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్‌ కిరవాణిలకు కూడా ఛాలెంజ్‌ ఇచ్చారు. ‘నా వంతు అయ్యింది సందీప్‌.. ఇప్పడు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ల వంతు వచ్చింది. ఇక చూడండి ముందుంది అసలైన సరదా.. అలాగే శోభు సుక్కు, ఆర్య సుక్కు, పెద్దన్న ఎమ్‌ఎమ్‌ కీరవాణి కూడా ఈ ఛాలెంజ్‌ ఇస్తున్నాను’ అంటూ ట్వీట్‌ చేశారు. (సందీప్‌ ఛాలెంజ్‌ స్వీకరించిన రాజమౌళి)

కాగా దర్శకుడు సందీప్‌ వంగ.. రాజమౌళి తన భార్యకు పనుల్లో సాయం చేయాలని కోరుతూ.. సవాలు విసిరిన సంగతి తెలిసిందే. దీంతో రాజమౌళి తన భార్యకు సాయంగా ఇంటి పనులు చేస్తున్న వీడియోను ట్విటర్‌లో సోమవారం షేర్‌ చేశారు. కాగా ప్రస్తుతం రాజమౌళి స్టార్‌ హీరోలు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లతో కలిసి మల్టీ స్టారర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను తెరకెక్కిస్తున్నారు. ఇటివల ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను ఉగాది కానుకగా ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ల అభిమానుల కోసం విడుదలు చేశారు. ప్రత్యేక టీజర్‌ను రామ్‌చరణ్‌ పుట్టిన రోజు మార్చి 27న విడుదల చేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ కోమరం భీంగా, రామ్‌చరణ్‌ అల్లు సీతారామరాజు పాత్రల్లో కనిపించనున్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా