రాజమౌళి ఇంట్లో పెళ్లి హడావిడి

29 Dec, 2018 00:52 IST|Sakshi
కార్తికేయ, పూజ

రాజమౌళి ఇంట్లో పెళ్లి హడావిడి మొదలయింది. పెళ్లెవరిదీ అంటే? రాజమౌళి కుమారుడు కార్తికేయది. జగపతిబాబు సోదరుడి కుమార్తె పూజా ప్రసాద్‌తో కార్తికేయ వివాహం రేపు (డిసెంబర్‌ 30) జరగనుంది. ఈ వేడుకకు జైపూర్‌లో ఓ ప్రైవేట్‌ హోటల్‌ వేదిక. ఈ పెళ్లి పనుల కోసం రాజమౌళి ఓ నెల రోజుల పాటు హాలిడేస్‌ కూడా తీసుకున్నారు. రాజమౌళి కుటుంబ సభ్యులతో పాటు పెళ్లికొడుకు, పెళ్లి కూతురు కూడా గురువారమే జైపూర్‌ చేరుకున్నారు.

ఈ వివాహ మహోత్సవానికి హాజరయ్యే అతిథులందరూ శుక్రవారం జైపూర్‌ ప్రయాణం అయ్యారు. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, నాని, అనుష్క Ôð ట్టి తదితరులు అతిథులుగా ఈ వేడుకలకు హాజరుకానున్నారు. మూడు రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో ఈరోజు సాయంత్రం మెహందీ,  సంగీత్‌ కార్యక్రమాలు జరగనున్నాయి. మెహందీ కార్యక్రమంలో 300మంది అతిథుల కోసం ఏర్పాటు చేసిన స్పెషల్‌ లంచ్‌ హైలెట్‌గా ఉండబోతోందని సమాచారం. ఈ స్పెషల్‌ లంచ్‌లో రాజస్థానీ తాలీను గెస్ట్‌లందరికీ ప్రత్యేకంగా సర్వ్‌ చేయనున్నారట.

స్పెషల్‌ కార్డ్‌
స్టార్‌ హోటల్స్‌లోని రూమ్స్‌లోకి ప్రవేశించాలంటే రూమ్‌ కార్డ్‌ తప్పకుండా ఉండాల్సిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లిలో అతిథులందరికీ రూమ్‌ని అరేంజ్‌ చేస్తూ, ఓ స్పెషల్‌ రూమ్‌ కార్డ్‌ను ఏర్పాటు చేశారట రాజమౌళి ఫ్యామిలీ. ఎవరి రూమ్‌ కార్డ్‌కు వాళ్ల ఫొటోను జతపరిచారు. ఈ విషయాన్ని యన్టీఆర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పంచుకున్నారు. ‘‘సంబరాలు మొదలయ్యాయి. ఇంతకంటే పర్సనల్‌ కీ దొరకదేమో’’ అంటూ ఫ్యామిలీ ఫొటో ఉన్న రూమ్‌ కీ కార్డ్‌ను షేర్‌ చేశారు.


హోటల్‌ కీ కార్డ్‌


ఎన్టీఆర్, రామ్‌చరణ్, నాని, రానా


 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా