షాకింగ్‌గా ఉంది.. కరోనాపై రాజ‌మౌళి ట్వీట్‌

16 Mar, 2020 11:31 IST|Sakshi

ప్రమాదకర కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచ దేశాలన్నీ స్తంభించాయి. ఏ రంగాన్నీ వదలని కోవిడ్‌.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే 6వేల మందికిపైగా మృతి చెందగా.. లక్షా 80వేలకు పైగా కేసులు ప్రపంచ వ్యాప్తంగా వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజ‌మౌళి  కరోనా వైరస్‌పై స్పందించారు.  ‘క‌రోనా కార‌ణంగా ప్రపంచం నిలిచిపోవ‌డం చూస్తుంటే షాకింగ్‌గా ఉంది. ఇలాంటి ప‌రిస్థితుల‌లో భ‌యాందోళ‌న‌లు వ్యాప్తి చెంద‌కుండా చూడాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది. కోవిడ్ 19 వ్యాప్తిని నివారించ‌డానికి తగిన చర్యలను పాటించండి. కరోనాపై అప్ర‌మ‌త్తంగా ఉంటే మంచింది’ అని రాజ‌మౌళి త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా  రాజ‌మౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో చాలా మంది విదేశీయుల న‌టులు న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. విదేశీయుల వీసాల‌ని కేంద్రం తాత్కాలిక‌ ర‌ద్దు చేసిన  నేప‌థ్యంలో ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్‌పై పడింది. కాగా కరోనా వ్యాప్తి కారణంగా తన సినిమా షూటింగ్‌లను తక్షణం వాయిదా వేసుకుంటున్నట్లు మెగాస్టార్‌ చిరంజీవి కూడా ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. వైరస్‌ వ్యాప్తి కాకుండా జనాలు గుమికూడకుండా క్రీడల్ని వాయిదా, మాల్స్, సినిమా హాల్స్‌ మూసివేయడం, స్కూల్స్, కళాశాలలకు సెలవులు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


 

మరిన్ని వార్తలు