మనం మెచ్చిన హాలీవుడ్‌!

1 Jan, 2018 00:22 IST|Sakshi

హాలీవుడ్‌కు ప్రపంచమంతా మార్కెట్‌ ఉన్న రోజుల్లో, ఆ సినిమాలు ఆడని ఒకే ఒక్క మార్కెట్‌ ఇండియా అంటారు. అలాంటి ఇండియన్‌ సినిమా మార్కెట్‌లోకీ హాలీవుడ్‌ చొచ్చుకొచ్చి రెండు దశాబ్దాలు దాటింది. ఈ రెండు దశాబ్దాల్లో ఇండియన్‌ సినిమా అభిమానికి హాలీవుడ్‌ పంచిన వినోదం అంతా ఇంతా కాదు. ‘జురాసిక్‌ పార్క్‌’ చూసి సంబరపడిపోయాం. ‘టైటానిక్‌’ చూసి అద్భుతం అనేసుకున్నాం. ‘స్పైడర్‌మేన్‌’ అన్నాం. ‘టెర్మినేటర్‌’ వెంటపడ్డాం. ‘అవతార్‌’ ప్రపంచంలో కొట్టుకుపోయాం. ‘ఇంటర్‌స్టెల్లార్‌’ను వింతగా చూశాం.

ముఖ్యంగా విజువల్‌ ఎఫెక్ట్స్‌ పరంగా అద్భుతాలు సృష్టించగల పేరున్న హాలీవుడ్‌ సినిమాలు ఇండియాలోనూ ఆ పేరుతోనే పాపులర్‌ అయ్యాయి. ఆ జానర్‌ సినిమాలే ఇక్కడ ఫేమస్‌. ఇక గతేడాది హాలీవుడ్‌కు ఇండియన్‌ సినిమా మంచి మార్కెట్‌గా అవతరించింది. 2017లో వండర్‌వుమన్, స్పైడర్‌మేన్‌ లాంటి సూపర్‌హీరో సినిమాలు ఇండియాలో దుమ్మురేపాయి. బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమాలు వసూళ్ల వర్షం కురిపించాయి. యాక్షన్, అడ్వెంచరస్‌ సినిమాలకే ఇండియాలో ఇప్పటికీ క్రేజ్‌ కనిపిస్తుందన్నది ఒప్పుకొని తీరాల్సిన విషయం.  

ఇక 2017కి ఏమాత్రం తగ్గకుండా ఇండియన్‌ సినిమా అభిమాని టేస్ట్‌కి తగ్గ భారీ బడ్జెట్‌ హాలీవుడ్‌ సినిమాలు 2018లోనూ బాక్సాఫీస్‌ను కొల్లగొట్టేందుకు వచ్చేస్తున్నాయి. ఇండియాలో ఈ ఏడాది చాలా సినిమాలే దుమ్మురేపుతాయని ట్రేడ్‌ భావిస్తోంది. ముఖ్యంగా ‘జురాసిక్‌ వరల్డ్‌ 2’, ‘అవెంజర్స్‌’, ‘డెడ్‌పూల్‌ 2’, ‘బ్లాక్‌ పాంథర్‌’, ‘ఎక్స్‌ మెన్‌’ తదితర సినిమాలపై ట్రేడ్‌ భారీ అంచనాలే పెట్టుకుంది. ఇప్పటికే వంద కోట్ల గ్రాస్‌ మార్క్‌ అన్నది ఇండియాలో హాలీవుడ్‌ సినిమాకు కామన్‌ అయిపోయింది. ఈ ఏడాది సరికొత్త రికార్డులు సెట్‌ చేసే సినిమాలు వస్తున్నాయని అభిమానులు కూడా ఆశిస్తున్నారు. మరి ఆ అంచనాలను ఈ భారీ బడ్జెట్‌ సినిమాలు అందుకుంటాయా? చూడాలి!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!

తమిళంలో నిన్ను కోరి

మహా సముద్రంలో...

స్పీడ్‌ పెరిగింది

బైలంపుడి ట్రైలర్‌ చాలా బాగుంది

రాముడు లంకకు వెళ్లొస్తే...

వనవాసం పెద్ద హిట్‌ అవుతుంది

ఆగస్టులో ఆరంభం?

అంతకన్నా ఏం కావాలి?

మూవీ రివ్యూ: స్ఫూర్తినింపే ‘సూపర్‌ 30’

నేచురల్‌ యాక్టర్‌ అంటున్నారు : ఆన్య సింగ్‌

సూపర్‌ 30కి సూపర్బ్‌ కలెక్షన్లు

‘రౌడీ’ తమ్ముడి రెండో సినిమా!

టెన్షన్‌ పడుతున్న ‘సాహో’ టీం

పుకార్లపై క్లారిటీ ఇచ్చిన పోసాని

అదే కాదు.. చాలా చేశాను : నిధి అగర్వాల్‌

అమలాపాల్‌ ‘నగ్నసత్యాలు’  

4జి ఉంటేనే సినిమా ఒప్పుకుంటా: ఇషా

అది మా అందరి వైఫల్యం

ఆగస్టులో ఎవరు

జాన్‌ ఎటాక్‌

ఫలితాన్ని ప్రేక్షకులే నిర్ణయిస్తారు

నిర్మాణం అంటే రోజుకో పెళ్లి చేసినట్టే

విశ్రాంతి లేదు

అంతా ఆశ్చర్యమే!

భార్య భయపెడితే?

స్వచ్ఛమైన ప్రేమకథను కాలుష్యం చేయలేదు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!

తమిళంలో నిన్ను కోరి

మహా సముద్రంలో...