‘బాలయ్య స్టెప్పులకు హీరోయిన్లు జడుసుకుంటారు’

7 Nov, 2019 14:28 IST|Sakshi

ఈ రోజుల్లో కామెడీ కొత్త పుంతలు తొక్కుతోంది. స్టాండప్‌ కామెడీ షోలను జనాలు ఎంతగానో ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో ఎంతోమంది స్టాండప్‌ కమెడియన్లు పుట్టుకొచ్చారు. అయితే నవ్వించడానికి ప్రత్యేకంగా స్క్రిప్ట్‌ తయారు చేసుకోవాల్సిన అవసరం లేదని అలెగ్జాండర్‌ బాబు నిరూపించాడు. ఓ పాట.. దానికి ముందు మాట.. వీటన్నింటి కన్నా ముందు సెలబ్రిటీలు. వీటిని ఆధారంగా చేసుకుని తన మాటలతో కామెడీని పండిస్తున్నాడు. యూట్యూబ్‌ స్టార్‌ కమెడియన్‌గా గుర్తింపు దక్కించుకున్నాడు. విమర్శలు, కామెడీ, మ్యూజిక్‌ అన్నింటి మేళవింపుతో చేసే అతని వీడియోలకు మిలియన్ల వ్యూస్‌ దక్కుతాయంటే అతని క్రేజ్‌ ఏపాటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫేమస్‌ పర్సనాలిటీస్‌పై అతను వేసే పంచ్‌లు, సెటైర్‌లే అతని కామెడీకి ప్రధానాధారం. తమిళ గాయకుడు ఏసుదాసు దగ్గర నుంచి తెలుగు సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం వరకు అందరినీ తన కామెడీలో భాగం చేశాడు.

అయితే అలెగ్జాండర్‌ కామెడీ వ్యంగ్యంగానే సాగినా ఎవరి మనోభావాలను నొప్పించకపోవడం గమనార్హం. ఇక తాజాగా అతను ఏసుదాసుకు నివాళిగా అర్పించిన వీడియోలో సింగర్స్‌తోపాటు టాలీవుడ్‌ ‘లెజెండ్‌’ బాలయ్యను కూడా వాడుకున్నాడు. మిడ్‌నైట్‌ మసాలా హీరోయిన్లు కూడా బాలకృష్ణ స్టెప్పులకు బెంబెలెత్తుతారని పేర్కొన్నాడు. ‘మాస్టర్‌ ఈ స్టెప్పు చెప్పనేలేదు అని వారు వారించినా అతనికి నచ్చింది చేస్తాడు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కష్టానికి తగిన న్యాయం చేస్తానంటూ అతనికి నచ్చినట్టుగా డాన్స్‌లు చేస్తాడు’ అని కామెంట్‌ చేశాడు. దీంతో అతన్ని చూసిన హీరోయిన్లు పారిపోతారు అని జోక్‌ పేల్చాడు. దీనికి అక్కడి జనం పగలబడి నవ్వినా బాలయ్య అభిమానులు మాత్రం కాస్త హర్ట్‌ అయ్యారు. అయితే, ఇలా ధైర్యంగా సెలబ్రిటీలపై పంచ్‌లు విసురుతూ కామెడీ చేసి అందులో విజయం సాధించడం మామూలు విషయం కాదు. ఇందుకుగానూ తమిళంలో ప్రముఖ సంస్థ బిహైండ్‌ వుడ్స్‌ గోల్డ్‌ మిక్‌.. అలెగ్జాండర్‌కు ‘ఇండియాలోనే బెస్ట్‌ మ్యూజికల్‌ స్టాండప్‌ కమెడియన్‌’ అవార్డు ప్రకటించింది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సంక్రాంతి వార్‌: మారిన రిలీజ్‌ డేట్స్‌

వైవాహిక అత్యాచారం: నటి క్షమాపణలు!

తెలుగు తెరపై ‘త్రివిక్రమ్‌’ మాటల మంత్రం

అతనే నా మొదటి ప్రియుడు: నటి

వేడుక చేద్దాం.. లవ్‌ యూ పప్పా: శృతిహాసన్‌

ఫిఫ్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ..

ప్రేమలో పడ్డాను.. పేరు చెప్పలేను: రాహుల్‌

ఆ కాంబినేషన్‌ ఇప్పుడు సెట్‌ కానుందా?

ప్రేమ కాదు ఫ్రెండ్‌షిప్పే!

నా గొంతు వినండి

అంతా నిశ్శబ్దం

ప్రేమతోనే సమస్య

నాలుగేళ్లకు మళ్లీ!

మామా అల్లుడి పాటల సందడి

చెల్లెలి కోసం...

మళ్లీ మళ్లీ రాని అవకాశం

సమయానికి వస్తాను... చెప్పింది చేస్తాను

కనెక్ట్‌ అయిపోతారు

‘జార్జ్‌రెడ్డి’ లిరికల్‌ వీడియో సాంగ్‌ ప్రోమో

తల్లిదండ్రుల విడాకులపై స్పందించిన శ్రుతి హాసన్‌

అందరూ..అనుమానితులే..

త్వరలో పున్నుతో లైవ్‌లోకి వస్తా: రాహుల్‌

చిన్న తాలా! దిష్టి తగులుతుంది కదా!

అది టెలికాస్ట్‌ చేయలేదు: బాబా భాస్కర్‌

టైటిల్‌ చేజారినా శ్రీముఖికి భారీ పేచెక్‌..

‘నిన్ను కన్నందుకు నీ తల్లి బాధపడాలి’

అభిమానిని తోసిపారేసిన రణు మొండాల్‌

‘నిరుద్యోగి’ కామెంట్‌పై ఆ హీరో అద్భుత రిప్లై..

ఆంటీ అన్నందుకు బూతులు తిట్టిన నటి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘బాలయ్య స్టెప్పులకు హీరోయిన్లు జడుసుకుంటారు’

సంక్రాంతి వార్‌: మారిన రిలీజ్‌ డేట్స్‌

వైవాహిక అత్యాచారం: నటి క్షమాపణలు!

అతనే నా మొదటి ప్రియుడు: నటి

వేడుక చేద్దాం.. లవ్‌ యూ పప్పా: శృతిహాసన్‌

ఫిఫ్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ..