బిగ్‌బాస్‌-4పై ‘స్టార్‌ మా’ ప్రకటన

20 Jul, 2020 20:47 IST|Sakshi

హైదరాబాద్‌ : బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-4 ఎప్పుడు ప్రారంభం అవుతుందా బుల్లితెర ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ షోకు సంబంధించి రకరకాల వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఈ ఏడాది బిగ్‌బాస్‌ షో ఉంటుందా? లేదా? అనే సందేహాలు ఏర్పడ్డాయి. అయితే వాటన్నింటికీ తెరదించుతూ.. బిగ్‌బాస్‌ సీజన్‌-4 పై స్టార్‌ మా అధికారిక ప్రకటన చేసింది. త్వరలోనే బిగ్‌బాస్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు తెలిపింది. ఈ మేరకు బిగ్‌బాస్‌ లోగోతో కూడిన ప్రోమోను ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. (బిగ్‌బాస్‌ సీజన్‌ 4 తాజా అప్‌డేట్‌)

బిగ్‌బాస్‌ సీజన్‌-4పై స్టార్‌‌ మా క్లారిటీ ఇవ్వడంతో.. ఇక అందులో పాల్గొనే కంటెస్టెంట్‌లు, హోస్ట్‌ వివరాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మరోవైపు ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోలో బిగ్‌బాస్‌ సెట్‌ వర్క్స్‌ ప్రారంభమయ్యాయి. అలాగే కంటెస్టెంట్‌ల ఎంపిక ప్రక్రియ కూడా కొనసాగుతుంది.
 

మరిన్ని వార్తలు