నక్షత్రానికి సుశాంత్‌ పేరు

6 Jul, 2020 17:51 IST|Sakshi


సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌కు ఖగోళం అంటే ఎంత ఆసక్తి ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆవిషయం తన అభిమానులందరికి కూడా తెలుసు. నటుడిగా మారిన తర్వాత కూడా ఆస్ట్రో ఫిజిక్స్‌పై సుశాంత్‌ అనేక అధ్యయనాలు చేశారు. విశ్వంలో ఉండే తారా మండలాన్ని చూడటానికి ఖరీదైన ఓ టెలిస్కోప్‌ను కొనుగోలు చేశారు. తనకు వీలు దొరికినప్పుడల్లా ఆ టెలిస్కోప్ నుంచి విశ్వంలోకి చూస్తూ ఉండే వారని ఆయనకు సన్నిహితంగా ఉండే వారు తెలిపారు. సుశాంత్‌ ఇష్టాలు తెలిసిన ఒక అభిమాని ఆయనకు గొప్పగా నివాళి ప్రకటించారు.అమెరికాలో ఉంటున్న  రక్ష అనే అభిమాని ఒక నక్షత్రాన్ని కొనుగోలు చేసి దానికి  సుశాంత్‌ పేరు పెట్టారు. అందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాన్ని ట్విట్టర్‌‌లో పోస్ట్ చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. (నేనూ కూడా నెపోటిజం బాధితురాలినే! )‘సుశాంత్‌ అద్భుతమైన వ్యక్తి. అతనికి నివాళులు అర్పించడంలో కొంత ఆలస్యం చేశాను. ఈ చీకటి ప్రపంచంలో ఆయన ఒక స్వచ్ఛమైన రత్నం లాంటివాడు. ఆయన మరింతగా మెరవాలి. ఆయన పేరు మీద ఉన్న నక్షత్రాన్ని ఆయన టెలిస్కోప్‌తో కొనడం చాలా సంతోషంగా ఉంది.  ఇక నుంచి ఆ తార మరింత ప్రకాశవంతంగా మెరువాలి. అని రక్ష అనే అభిమాని ట్వీట్ చేశారు. విశ్వంలో ఉంటే తారల్లో ఒకటైన RA 22.121 కు జూన్ 25,2020 నుంచి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌గా నామకరణం చేశారు. ఆ మేరకు ఖగోళ శాస్త్ర సంస్థ మాకు హక్కులు కల్పించింది. ఆ తారకు సంబంధించిన హక్కులు, కాపీరైట్స్ మాకు లభించాయి అని కూడా రక్ష పేర్కొన్నారు. చంద్రమండలంపై కూడా సుశాంత్‌ భూమిని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. (‘సుశాంత్‌తో నేను మాట్లాడితే అలా జరిగేది కాదేమో’)

 
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా