కుటుంబసమేతంగా.. ‘సుబ్రహ్మణ్యపురం’

5 Dec, 2018 19:55 IST|Sakshi

‘మళ్లీరావా’ సినిమా విజయంతో రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సుమంత్ సూపర్‌ నేచురల్‌ థ్రిల్లింగ్ కథాంశంతో ‘సుబ్రహ్మణ్యపురం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇది సుమంత్‌కు 25 చిత్రం కావడం విశేషం. సుమంత్ సరసన ఈషా రెబ్బ హీరోయిన్.  సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై బీరం సుధాకర్‌రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం డిసెంబ‌ర్ 7న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా నిర్మాత సుధాక‌ర్‌ రెడ్డి మాట్లాడుతూ..

‘మా ఇంటి కుల దైవం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ సినిమా కూడా సుబ్రమణేశ్వర స్వామి పేరుతో ఉండడంతో పాటు కథ నచ్చడంతో నేనే ప్రొడ్యూస్‌ చెయ్యాలని నిర్ణయించుకున్నాను. మా సినిమా 'కార్తికేయ' సినిమాకు పూర్తి బిన్నంగా ఉంటుంది. కొత్త డైరెక్టర్‌ అయినా ఈ సినిమాను చాలా బాగా హ్యాండిల్‌ చేశాడు. ఈ సినిమా 'మానవ మేధస్సు గొప్పదా - దైవశక్తి గొప్పదా' అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. ఈ సినిమా చూసిన తరువాత దైవాన్ని నమ్మని వాళ్ళు కూడా దైవం ఉంది అని నమ్మేవిధంగా ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కించడం విశేషం. (‘సుబ్రహ్మణ్యపురం’కు సూపర్బ్‌ రెస్పాన్స్‌)

పూర్వకాలం,సెకండ్‌ వరల్డ్‌ వార్‌ టైం నుండి దైవం యొక్క గొప్పతనం ఈ సినిమాలో చూపించడం జరిగింది. వాటితో పాటు ఆడియన్స్‌ కోరుకునే అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఈసినిమాలో ఉంటాయి. మా సినిమా కూడా కుటుంబసమేతంగా చూడగలిగిన సినిమా అని ఆ రోజునే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం. ఈ స్టోరీకి సుమంత్‌ గారైతే యాప్ట్‌గా ఉంటుందని ముందే ఫిక్సయ్యాం. ఈ సినిమాలో కూడా కథకు అనుగుణంగా గ్రాఫిక్స్‌కు మంచిప్రాధాన్యం ఉంటుంది’ అంటూ సుధాకర్‌ రెడ్డి పేర్కొన్నారు. (నా ప్లస్, మైనస్‌ అదే)

మరిన్ని వార్తలు