20 Oct, 2018 11:01 IST|Sakshi

కరునాడ చక్రవర్తి, హ్యాట్రిక్‌ హీరో శివరాజ్‌కుమార్‌ 36 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉంటున్నారని, సినిమా కథ వినకుండా నటించేంందుకు ఆయన ఒప్పుకుంటారా అని శివన్న అభిమానులను కిచ్చా సుదీప్‌ ప్రశ్నించారు. సుదీప్, శివరాజ్‌కుమార్‌ ప్రధాన పాత్రధారులుగా గురువారం ‘విలన్‌’ సినిమా విడుదల అయింది. ఈ సినిమాలో శివరాజ్‌కుమార్‌పై సుదీప్‌ చేయి చేసుకునే సన్నివేశం ఉంది. ఈ సందర్భంగా తమ అభిమాన నటుడిపై సుదీప్‌ చేయి చేసుకున్నారని సుదీప్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో ఇద్దరి హీరోల అభిమానుల మధ్య పెద్ద వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో దావణగెరెలో మీడియాతో సుదీప్‌ మాట్లాడుతూ... చిత్రరంగంలో ఎంతో అనుభవం ఉన్న శివరాజ్‌కుమార్‌ కథ వినకుండా సినిమాలో నటిస్తారా అని ప్రశ్నించారు. అనవసరంగా రాద్ధాంతం చేయకుండా సినిమాను సినిమాగా చూడాలని సూచించారు. కావాలంటే ఆ ఫైట్‌ సీన్‌ సినిమా నుంచి తొలగిస్తే తనకు ఏలాంటి అభ్యంతరంలేదని సుదీప్‌ స్పష్టం చేశారు.

సినిమాను చూసిన శివరాజ్‌కుమార్‌ అభిమానులు డైరెక్టర్‌ ప్రేమ్‌పై ఆక్రోశంను వ్యక్తం చేస్తున్నారు. ఆ సీన్‌ను సినిమా నుండి తొలగించాలని అభిమానులు డిమాండ్‌ చేస్తున్నారు. లేకుంటే అందోళన చేయాలని శివరాజ్‌కుమార్‌ అభిమానులు నిర్ణయించారు. అలాగే మరో సీనియర్‌ నటుడు దర్శన్‌పై కూడా సుదీప్‌ స్పందించారు. దర్శన్‌కు తనకు ఎలాంటి గొడవలు లేవని, ఇద్దరి మధ్య కొద్దిపాటి మనస్పర్థలు మాత్రమే ఉన్నాయని తెలిపారు.

మరిన్ని వార్తలు