కన్నడ 'బాపుబొమ్మ' హరిప్రియ

29 Jul, 2014 10:16 IST|Sakshi
కన్నడ 'బాపుబొమ్మ' హరిప్రియ

కన్నడ అగ్రనటుడు సుదీప్ సరసన హరిప్రియ ఛాన్స్ కొట్టేసింది. తెలుగులో ఘన విజయం సాధించిన 'అత్తారింటికి దారేది' ఆధారంగా సుదీప్ హీరోగా కన్నడంలో తెరకెక్కుతున్న చిత్రంలో హరిప్రియకు అవకాశం దక్కింది. 'బాపుబొమ్మ' ప్రణీత పోషించిన ప్రాత్రను కన్నడంలో ఆమె చేయబోతోంది.

ఇక తెలుగులో సమంత చేసిన పాత్రను కన్నడంలో రచితా రామ్ దక్కించుకుంది. ఈ పాత్రను మొదట హన్సిన చేస్తుందని ఊహాగానాలు వచ్చాయి. అయితే ఈ సినిమా చేయడం లేదని హన్సిక స్పష్టం చేసింది.

ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాకు 'విక్టరీ' ఫేమ్ నందకిశోర్ దర్శకత్వం వహించనున్నారు. ప్రభాస్ 'మిర్చీ' సినిమాను కన్నడంలోకి రీమేక్ చేసి విజయం సాధించిన సుదీప్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాను రీమేక్ చేస్తున్నారు.