'ఆ అమ్మాయి అంతగా నటించాల్సిన అవసరం లేదు'

9 Aug, 2018 14:34 IST|Sakshi

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు నటించిన 25వ చిత్రం మహర్షి టీజర్‌ అభిమానులనే కాదు సినీ తారలనూ సర్‌ప్రైజ్‌కు గురిచేసింది. మహేష్‌ పుట్టినరోజు సందర్భంగా గత రాత్రి టైటిల్‌తోపాటు ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేయగా.. గురువారం టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. మీట్‌ రిషి అన్న కాప్షన్‌తో.. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో స్టైల్‌గా నడుచుకుంటూ వెళ్తున్న మహేష్‌..  అమ్మాయిలును ఓరకంటగా చూస్తూ వెళ్తున్న టీజర్‌ ఆకట్టుకునేలా ఉంది.

మహర్షి టీజర్‌ చూసిన సుధీర్‌ ట్విట్టర్‌లో స్పందించారు. 'సినిమాకు తగ్గట్టుగా ప్రతి క్యారెక్టర్‌లో మహేష్‌ పరకాయ ప్రవేశం చేస్తూ కొత్తగా కనిపిస్తారు. అంతకుమించి ఈ టీజర్‌లో మహేష్‌ ఫ్రెష్‌గా‌, ఫ్లర్టేషియస్‌గా కనిపించి పెద్ద సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఇదే టీజర్‌లో నన్ను సర్‌ప్రైజ్‌ చేయని మరో విషయం కూడా ఉంది. అదేంటంటే టీజర్‌లో కనిపించిన అమ్మాయి నటించకుండా ఉండాల్సింది. ఎందుకంటే మహేశ్‌ను చూడగానే ఏ అమ్మాయికైనా ఆ ఎక్స్‌ప్రెషన్స్‌ సహజంగానే వచ్చేస్తాయి' అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఇప్పటివరకు ఏ దర్శకుడు చూపించలేని విధంగా సూపర్‌స్టార్‌ లుక్‌ను కొత్తగా చూపించారని దర్శకుడు వంశీపైడిపల్లిని సుధీర్‌ అభినందిస్తూ, చిత్రం ఘనవిజయం సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు. సుధీర్‌ బాబు నటిస్తున్న'నన్ను దోచుకుందువటే' టీమ్‌ తరపున మహేష్‌ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

మహర్షి టీజర్‌లో దేవీ మార్క్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ కూడా ఇంప్రెసివ్‌గా ఉంది. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అశ్వనీదత్‌, దిల్‌ రాజు, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. అల్లరి నరేష్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు