పవర్‌ఫుల్‌ ఆఫీసర్‌

28 Jan, 2020 05:58 IST|Sakshi
సుధీర్‌బాబు

నువ్వా? నేనా? అని పోటీపడ్డారు నాని, సుధీర్‌బాబు. నాని నేచురల్‌ స్టార్‌ అని ఎప్పుడో అనిపించుకున్నారు. ఆ తర్వాత వచ్చిన సుధీర్‌బాబు కూడా ఒక్కో సినిమాకి నిరూపించుకుంటూ మంచి నటుడు అనిపించుకున్నారు. ఈ ఇద్దరూ నువ్వా? నేనా? అంటూ ‘వి’ సినిమాలో పోటీపడి నటించారు. నానీతో ‘అష్టా చమ్మా, జెంటిల్‌మేన్‌’ వంటి హిట్‌ చిత్రాలను, సుధీర్‌బాబుతో ‘సమ్మోహనం’ వంటి హిట్‌ చిత్రాన్ని తీసిన ఇంద్రగంటి మోహనకృష్ణ ‘వి’ చిత్రానికి దర్శకత్వం వహించారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై రాజు, శిరీష్, హర్షిత్‌ రెడ్డి నిర్మించారు. నాని  ఓ డిఫరెంట్‌ రోల్‌లో.. ఆ పాత్రకు దీటుగా ఉండే పవర్‌ఫుల్‌ ఐపీయస్‌ ఆఫీసర్‌ పాత్రలో సుధీర్‌బాబు నటించారు. సోమవారం సుధీర్‌ లుక్‌ని విడుదల చేశారు. ‘‘భారీ బడ్జెట్‌తో ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ని రూపొందించాం. ఇటీవలే షూటింగ్‌ పూర్తయింది. ఉగాది సందర్భంగా మార్చి 25న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. నివేదా థామస్, అదితీ రావ్‌ హైదరీ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్‌: అమిత్‌ త్రివేది, కెమెరా: పి.జి.విందా.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా