అందమైన జ్ఞాపకాల దొంతర

27 May, 2014 22:40 IST|Sakshi
అందమైన జ్ఞాపకాల దొంతర

సుధీర్‌బాబు, నందిత జంటగా ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతోంది.  ఆర్. చంద్రు దర్శకత్వంలో రామలక్ష్మీ క్రియేషన్స్ పతాకంపై శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్న ఈ చిత్రం మంగళవారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి బి.గోపాల్ కెమెరా స్విచాన్ చేయగా, ఎ.కోదండరామిరెడ్డి క్లాప్ ఇచ్చారు. కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘కన్నడ చిత్రం ‘చార్మినార్’కు ఇది రీమేక్. తొలి చూపులోనే ప్రేమ అన్నట్టు... ఆ సినిమా చూడగానే ప్రేమలో పడిపోయి ఈ కథను తెలుగు ప్రేక్షకులకు కూడా అందించాలని నిర్ణయం తీసుకున్నాను. ‘ప్రేమకథాచిత్రమ్’ జంట సుధీర్‌బాబు, నందిత ఈ సినిమా కోసం జతకట్టడం ఆనందంగా ఉంది.
 
 చంద్రు ఈ చిత్రాన్ని చక్కగా తెరకెక్కిస్తాడనే నమ్మకం నాకుంది’’ అని లగడపాటి శ్రీధర్ చెప్పారు. ప్రతి ప్రేక్షకుని మనసునీ హత్తుకుపోయే సినిమా ఇదని, ఇదొక అందమైన జ్ఞాపకాల దొంతర అని సుధీర్‌బాబు అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘కన్నడంలో భారీ సినిమాల మధ్య విడుదలై ‘చార్మినార్’ ఘన విజయం సాధించింది. శ్రీధర్‌గారు కథకు తగ్గ టైటిల్ ఖరారు చేశారు. ‘ఓనమాలు’ఫేం ఖదీర్‌బాబు సంభాషణలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి. మంచి టీమ్ కుదిరింది’’ అని తెలిపారు. గిరిబాబు, ఎమ్మెస్ నారాయణ, సారిక రామచంద్రరావు, చిట్టిబాబు తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కేఎస్ చంద్రశేఖర్, కళ: నారాయణరెడ్డి, సంగీతం: హరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దేవినేని రవికుమార్.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి