సుడిగాలి వస్తోంది

5 Oct, 2018 05:54 IST|Sakshi
అభయ్, మమత, వెంకటేశ్‌

వెంకటేష్‌ గౌడ్, ప్రాచీ అధికారి, అభయ్, కులకర్ణి మమత ముఖ్య తారలుగా రమేష్‌ అంకం దర్శకత్వం  వహించిన చిత్రం ‘సుడిగాలి’. శివపార్వతి క్రియేషన్స్‌పై చెట్టుపల్లి వెంకటేష్, బిరాదర్‌ మల్లేష్‌ నిర్మించారు. రాప్‌ రాక్‌ షకీల్‌ స్వరపరచిన ఈ చిత్రం పాటలను ఎమ్మెల్సీ రాములు నాయక్, నిర్మాత సాయి వెంకట్‌ విడుదల చేశారు. ‘‘పాటలు, ట్రైలర్‌ బాగున్నాయి. కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న సినిమాలు మంచి విజయాలు సాధిస్తున్నాయి. అదే తరహాలో ‘సుడిగాలి’ సినిమా సూపర్‌ హిట్‌ కావాలి’’ అన్నారు రాములు నాయక్‌. ‘‘యాక్షన్‌ రొమాంటిక్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. మా చిత్రంలో సుమన్‌గారు మంచి పాత్ర చేశారు. సినిమాని త్వరలోనే విడుదల చేయనున్నాం’’ అన్నారు నిర్మాతలు. ‘‘హీరో హీరోయిన్లు కొత్తవారైనా బాగా నటించారు’’ అన్నారు రమేష్‌ అంకం. ‘‘సుడిగాలి’తో నాకు మంచి బ్రేక్‌ వస్తుందని ఆశిస్తున్నా’’ అన్నారు వెంకటేశ్‌. ఈ చిత్రానికి కెమెరా: విద్యాసాగర్, సమర్పణ: చెట్టుపల్లి లక్ష్మి.

మరిన్ని వార్తలు