‘రంగస్థలం’ క్లైమాక్స్‌ వివాదం.. క్లారిటీ ఇచ్చిన సుకుమార్‌

29 May, 2018 12:19 IST|Sakshi

రంగస్థలం సినిమాను ఇటు మెగా అభిమానులే కాదు...అటు తెలుగు ప్రేక్షకులు కూడా మర్చిపోలేరు. సుకుమార్‌ సృజనాత్మకతకు రంగస్థలం నిదర్శనం. కథను చెప్పిన విధానం, ప్రేక్షకులు మెచ్చేలా తీసిన విధానం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. చరణ్‌ అద్భుత నటన, దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం, సుకుమార్‌ డైరెక్షన్‌ ఈ సినిమాను  ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేశాయి.

రంగస్థలం కాన్సెప్ట్‌ తనదేనంటూ,తన కథను కాపీ కొట్టారంటూ గాంధీ అనే వ్యక్తి రచయితల సంఘంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై సుకుమార్‌ను వివరణ ఇవ్వాల్సిందిగా రచయితలగా సంఘం కోరగా... తాను గానీ , తన బృందంలోని సభ్యులు గానీ గాంధీ అనే వ్యక్తిని అసలు కలుసుకోలేదనీ చెప్పాడు. ఉరిశిక్ష పడ్డ వ్యక్తి పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఉరి తీస్తారనీ, ఆ లైన్‌తోనే తాను క్లైమాక్స్‌ను రాసుకున్నానని తెలిపారు. తాను చిన్నప్పుడు ధర్మ యుద్దం సినిమా చూసినప్పటి నుంచీ తనలో ఆ పాయింట్‌ గుర్తుండిపోయిందనీ, అంతేకాకుండా సిడ్నీ షెల్డన్‌ రాసిన ఎ స్ట్రేంజర్‌ ఇన్‌ ది మిర్రర్‌, బాలీవుడ్‌ మూవీ అంజామ్‌లో కూడా ఇదే లైన్‌ ఉంటుందనీ వివరించారు. అయితే తాను ఎంచుకున్న ఈ లైన్‌కు తనదైన పద్దతిలో కథ, కథనాన్ని రచించానంటూ వివరణ ఇచ్చాడు. 

ఓ సినిమా వివాదాలు లేకుండా ఈ మధ్య కాలంలో గట్టెక్కితే ఆశ్చర్యం కలగక మానదు. ఈ సినిమాలో రంగమ్మ మంగమ్మ పాటలో ఓ పదం ఓ వర్గాన్ని కించపరిచేలా ఉందనడంతో ఆ పదాన్నితొలిగించేశారు. భరత్‌ అనే నేను సినిమా కథను కొరటాల శివ ఓ రచయిత దగ్గరి నుంచి కొన్నాడని, అది వేరే ఓ హీరో కోసం రెడీ చేసిన కథ అంటూ వివాదాలు వచ్చాయి. తర్వాత కొరటాల వీటిపై క్లారిటీ ఇచ్చేశాడు. మహానటిపై ఎలాంటి వివాదాలు లేవు అనుకునే సమయాని​కి.. జెమినీ గణేశన్‌ పాత్రను తక్కువ చేసి చూపారనీ, నెగిటివ్‌గా చూపారనీ విమర్శలు వచ్చాయి. 

మరిన్ని వార్తలు