లవ్‌స్టోరీకి క్లాప్‌

30 May, 2019 00:07 IST|Sakshi
శశిధర్, హవీష్, అభిషేక్, సుకుమార్, సునీల్‌

హవీష్‌ హీరోగా రాఘవ ఓంకార్‌ శశిధర్‌ దర్శకుడిగా పరిచయం కానున్న చిత్రం ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. దేవాన్ష్‌ నామా అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై అభిషేక్‌ నామా నిర్మిస్తున్నారు. ఈ వేడుకకు అతి«థిగా విచ్చేసిన దర్శకుడు సుకుమార్‌ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌ ఇవ్వగా,  సదానంద్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ఏషియన్‌ సునీల్‌ నారంగ్‌ స్క్రిప్ట్‌ అందించారు. ఈ సందర్భంగా శశిధర్‌ మాట్లాడుతూ– ‘‘నన్ను ప్రపంచానికి పరిచయం చేసిన తల్లిదండ్రులు ఎంత గొప్పవారో, ఓ దర్శకుడికి తొలి అవకాశం ఇచ్చిన నిర్మాత, హీరో అంతే గొప్ప. 14 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. ‘లడ్డు, నన్ను క్షమించు’ వంటి లఘుచిత్రాలను తీశాను.

వాటికి నంది అవార్డులు, జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు వరించాయి. నన్ను దర్శకుడిగా ఎంపిక చేసిన సుకుమార్‌గారికి ధన్యవాదాలు. అందరి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. జూలై చివరి వారం నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ను జరపనున్నాం’’ అన్నారు. ‘‘మంచి ఫ్యామిలీ, రొమాంటిక్‌ లవ్‌స్టోరీ ఇది. ఇందులో హీరోగా నటిస్తున్నందుకు, ఆనందంగా ఉంది. శశి ప్రతిభ ఉన్న దర్శకుడు. భవిష్యత్‌లో పెద్ద దర్శకుడు అవుతాడు. అభిషేక్‌గారు ప్యాషనేట్‌ ప్రొడ్యూసర్‌’’ అన్నారు హీరో హవీష్‌. ‘‘సుకుమార్, మేం నిర్వహించిన షార్ట్‌ ఫిలిం కాంటెస్ట్‌లో శశిధర్‌ మొదటి బహుమతిని పొందారు. అలా శశిధర్‌కు దర్శకుడిగా తొలి అవకాశం కల్పించాం’’ అన్నారు అభిషేక్‌ నామా. ఈ సినిమాకు చేతన్‌ భరద్వాజ్‌ స్వరకర్త.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా