‘లూసిఫర్‌’ బాధ్యతలు సుకుమార్‌కు?

12 Feb, 2020 17:25 IST|Sakshi

మలయాళంలో సంచలన విజయం సాధించిన చిత్రం ‘లూసిఫర్‌’. మోహన్‌లాల్‌ హీరోగా నటించిన ఈ చిత్రం ఆక్కడ ఎంతటి ట్రెండ్‌ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఈ సినిమాలోని హీరో ఎలివేషన్‌ సీన్స్‌ చాలా కొత్తగా సూపర్బ్‌గా ఉంటాయి. కాగా, తన తండ్రి మెగాస్టార్‌ చిరంజీవి కోసం  ‘లూసిఫర్‌’ చిత్ర తెలుగు హక్కులను మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కొరటాల శివ చిత్రంతో బిజీగా ఉన్న చిరంజీవి ఆ తర్వాత ‘లూసిఫర్‌’ రీమేక్‌ను పట్టాలెక్కిస్తారని తెలుస్తోంది. తాజాగా ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించే బాధ్యతను క్రియేటీవ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌కు రామ్‌చరణ్‌ అప్పగించనట్టు టాలీవుడ్‌ టాక్‌. అంతేకాకుండా లూసిఫర్‌లో పృథ్వీరాజ్‌ పాత్రను రామ్‌చరణ్‌ పోషించే అవకాశం ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ముందుగా డైరెక్టర్‌ పరుశురామ్‌తో ఈ చిత్రాన్ని రీమేక్‌ చేయాలని భావించినప్పటికీ యూత్‌లో ఉన్న క్రేజ్‌తో ఆ బాధ్యతను సుకుమార్‌కు అప్పగించారని టాక్‌.  

ప్రస్తుతం అల్లు అర్జున్‌ చిత్రంతో సుకుమార్‌, కొరటాల శివ చిత్రంతో చిరంజీవి బిజీబిజీగా ఉన్నారు. వీరిద్దరి సినిమాలు ఈ ఏడాది చివర్లో పూర్తి కానున్నాయి. ఆ తర్వాత ‘లూసిఫర్‌’ రీమేక్‌ను పట్టాలెక్కించే అవకాశం ఉంది. అయితే చిరంజీవి తన తదుపరి చిత్రం త్రివిక్రమ్‌తో తీసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని సమాచారం. సినిమాల్లో రీఎంట్రీ తర్వాత ‘ఖైదీ 150’, ‘సైరా’, ప్రస్తుతం ‘ఆచార్య(అనధికారిక టైటిల్‌)’ వంటి సామాజిక, పీరియాడిక్‌ అంశాలను ఎంచుకున్న మెగాస్టార్‌ తన తదుపరి చిత్రం వినోదాత్మకంగా ఉండాలనే ఆలోచనల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా లూసిఫర్‌ను మరికొంత కాలం ఆపి త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేశాక ఆ చిత్రాన్ని తెరకెక్కించాలని భావిస్తున్నారట. అంతేకాకుండా లూసిఫర్‌ను తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేర్పులు చేసేందుకు తగిన సమయం కావాలని సుకుమార్‌ బృందం కోరినట్లు తెలుస్తోంది. అయితే ఆలస్యమైనా ‘లూసిఫర్‌’ చిత్రాన్ని సుకుమార్‌తోనే తెరకెక్కించాలని రామ్‌చరణ్‌ భావిస్తున్నాడట. 

చదవండి: 
‘పారాసైట్’ విజయ్ మూవీ కాపీనా..!
అప్పుడు అభిమన్యుడు.. ఇప్పుడు శక్తి
​​​​​​​

మరిన్ని వార్తలు