వారసుడొస్తున్నాడు

30 May, 2018 04:35 IST|Sakshi
సుమలత, అభిషేక్‌

తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో దాదాపు 200 చిత్రాల్లో నటించారు కథానాయిక సుమలత. నైన్టీస్‌లో తిరుగులేని కథానాయికగా పేరు సంపాదించుకున్నారు. ఇక ఆమె భర్త అంబరీష్‌ కన్నడంలో మంచి స్టార్‌. ఈ దంపతుల తనయుడు అభిషేక్‌ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు. అంటే వారసుడొస్తున్నాడన్నమాట.

నాగ్‌ శేఖర్‌ దర్శకత్వంలో రూపొందనున్న ‘అమర్‌’ అనే కన్నడ సినిమా ద్వారా అభిషేక్‌ హీరోగా పరిచయం కానున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమం పూర్తి అయ్యింది. మిస్‌ ఇండియా ఫైనలిస్ట్‌ తాన్యా హోప్‌ ఈ సినిమాలో హీరోయిన్‌. ఈ చిత్రం కోసం థాయ్‌ల్యాండ్‌లో మార్షల్‌ ఆర్ట్స్‌లో స్పెషల్‌ ట్రైనింగ్‌ తీసుకున్నారు అభిషేక్‌. రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలోనే స్టార్ట్‌ కానుంది. అన్నట్లు.. మంగళవారం అంబరీష్‌ పుట్టినరోజు. తనయుడు హీరోగా అరంగేట్రం చేయడం ఆయనకు ఈ బర్త్‌డే స్పెషల్‌ అనొచ్చు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా