‘హ్యాపి వెడ్డింగ్‌’.. ఫస్ట్‌ ఇన్విటేషన్‌

21 Jun, 2018 15:41 IST|Sakshi

‘తూనీగ తూనీగ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చా రు స్టార్‌ ప్రొడ్యూసర్‌ ఎమ్‌ ఎస్‌ రాజు తనయుడు సుమంత్‌ అశ్విన్‌. లవర్స్‌, కేరింత లాంటి విజయవంతమైన చిత్రాలు అతని ఖాతాలో ఉన్నప్పటికీ గత కొంతకాలం పాటు సరైన హిట్‌లేక వెనుకబడ్డారు. అయితే ప్రస్తుతం ఈ కుర్ర హీరో ‘హ్యాపి వెడ్డింగ్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను ‘ఫస్ట్‌ ఇన్విటేషన్‌’ పేరుతో విడుదల చేశారు. ఈ సినిమాలో మెగా డాటర్‌ నిహారిక కొణిదెల హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘ఒక మనసు’తో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు నిహారిక. కమర్షియల్‌గా ఆ సినిమా విజయవంతం కాకపోయినా నటన పరంగా నిహారికకు మంచి మార్కులే పడ్డాయి. ఆ సినిమా తరువాత మళ్లీ తెలుగులో ఇంకో సినిమా చేయలేదు. తమిళంలో విజయ్‌సేతుపతితో కలిసి ఓ సినిమా చేసినా, అది తెలుగులో విడుదల కాలేదు. అయితే ఈ ‘హ్యాపి వెడ్డింగ్‌’ సినిమా నిహారికకు, సుమంత్‌కు విజయం అందిస్తుందో లేదో వేచి చూడాలి. యూవీ క్రియేషన్స్‌ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌ను జూన్‌ 30న రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు