సుమంత్‌ అశ్విన్‌ కొత్త సినిమా ఆరంభం

26 Feb, 2020 12:12 IST|Sakshi

సినిమా సినిమాకు డిఫరెంట్‌ వేరియేషన్స్‌ చూపిస్తూ హీరోగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు సుమంత్‌ అశ్విన్‌. ఫలితాలతో సంబంధం లేకుండా హార్రర్‌, కామెడీ, ఫ్యామిలీ, రొమాంటిక్‌ వంటి డిఫరెంట్‌ జానర్‌లలో సినిమాలు చేస్తూ నటుడిగా ప్రూవ్‌ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. హ్యాపీ వెడ్డింగ్‌, ప్రేమకథా చిత్రం-2  తర్వాత ఈ హీరో సినిమాలకు కాస్త గ్యాప్‌ ఇచ్చాడు. 

అయితే ప్రస్తుతం గురు పవన్‌ అనే దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. సుమంత్‌ అశ్విన్‌ సరసన ప్రియా వడ్లమాని కథానాయికగా నటిస్తున్న ఈచిత్రంలో శ్రీకాంత్‌, ఇంద్రజ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్‌ పతాకంపై జి.మహేశ్‌ నిర్మిస్తున్నారు . తాజాగా ఈ చిత్ర షూటింగ్‌ స్థానిక రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్‌ ప్రముఖులు హాజరయ్యారు. 

త్వరలోనే చిత్ర రెగ్యులర్‌ షూటింగ్‌ జరుగుతుందని దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రం సుమంత్‌ అశ్విన్‌ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘నలుగురు అపరిచితులు.. 3450 కిలోమీటర్ల ప్రయాణం.. గమ్యం ఒకటే.. చివరికి ఏమైంది.. ఎందుకు ప్రయాణించారు’.. ఇలా డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమా ఉండబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సునీల్‌ కశ్యప్‌ సంగీతమందిస్తున్నాడు. 

చదవండి:
50 శాతం పూర్తి.. వీసా కోసం వెయిటింగ్‌
'ముద్దు సన్నివేశం నాకు తెలియకుండానే తీశారు'​​​​​​​

మరిన్ని వార్తలు