ధనం కాదా?

26 Jun, 2018 01:21 IST|Sakshi

‘ధనం మూలం ఇదం జగత్‌’ అని అంటారు. ఈ సినిమా టైటిల్‌ ‘ఇదం జగత్‌’. మరి.. ఇదంకి ముందు ఉన్నది ఏంటి? ధనం కాదా? సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇటీవల ‘మళ్లీరావా’ సినిమాతో హిట్‌ ట్రాక్‌లోకి వచ్చిన హీరో సుమంత్‌ నటించిన తాజా చిత్రం ‘ఇదం జగత్‌’. అంజు కురియన్‌ హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. అనిల్‌ శ్రీ కంఠం దర్శకత్వంలో విరాట్‌ ఫిల్మ్స్‌ అండ్‌ విఘ్నేష్‌ కార్తీక్‌ సినిమాస్‌ పతాకాలపై జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్‌లు నిర్మించారు. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను సోమవారం విడుదల చేశారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘ఇప్పటివరకు టచ్‌ చేయని నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రను ఈ చిత్రంలో సుమంత్‌ చేశారు. ప్రేక్షకులు ఈ పాత్రకు థ్రిల్‌ అవుతారు. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఈ చిత్రం తప్పనిసరిగా నచ్చుతుంది. సినిమా షూటింగ్‌ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఆడియో, సినిమా విడుదల తేదీలను ప్రకటిస్తాం’’ అని తెలిపారు. శివాజీరాజా, సత్య, షఫీ, కళ్యాణ్‌ విథపు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: బాల్‌ రెడ్డి, ఎడిటింగ్‌: గ్యారీ బీహెచ్, సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, కో–ప్రొడ్యూసర్‌: మురళీకృష్ణ దబ్బుగుడి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు