సుమంత్‌ హీరోగా ‘ఇదం జగత్‌’

1 Apr, 2018 10:34 IST|Sakshi

సక్సెస్‌ కోసం చాలా కాలం ఎదురుచూసిన అక్కినేని వారసుడు సుమంత్‌ ఇటీవల మళ్ళీరావా సినిమాతో ఘనవిజయాన్ని అందుకున్నాడు. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా సుమంత్‌ను సక్సెస్‌ ట్రాక్‌ లోకి తీసుకువచ్చింది. మళ్ళీరావా ఇచ్చిన జోష్‌తో మరిన్ని సినిమాలకు ఓకె చెప్పాడు సుమంత్‌. ప్రస్తుతం అనిల్‌ శ్రీకంఠంని దర్శకుడి పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న థ్రిల్లర్‌ సినిమాలో నటిస్తున్నాడు సుమంత్‌. ఈ సినిమాలో ప్రేమమ్‌ ఫేం అంజు కురియెన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాకు ఇదం జగత్‌ అనే టైటిల్‌ను కన్ఫామ్ చేశారు. తాజాగా ఈ సినిమా టైటిల్‌ లోగోను రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌.  ఈ సినిమాలో సుమంత్‌ ఫొటో జర్నలిస్ట్‌ పాత్రలో నటిస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాతో తొలిసారిగా సుమంత్‌ నెగెటివ్‌ టచ్‌ ఉన్న పాత్రలో నటిస్తున్నారన్న ప‍్రచారం జరుగుతోంది. ఈ సినిమాతో పాటు సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ‘‘సుబ్రహ్మణ్యపురం’ సినిమాలోనూ నటిస్తున్నాడు.

మరిన్ని వార్తలు